కాలినడకన తిరుమలకు సమంత.. మొక్కు చెల్లించింది అందుకేనా?
Recommended Video

సక్సెస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిన సమంత అక్కినేని ఇటీవల కాలంలో వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది రంగస్థలం, అభిమన్యుడు, మహానటి లాంటి చిత్రాలను 2018లో తన ఖాతాలో వేసుకొన్నారు. 2019 ఏడాదిని కూడా ఘనంగా ప్రారంభించారు సమంత. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. అలాగే ఆమె నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సమంత తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. వివరాల్లోకి వెళితే...

కాలినడకన అలిపిరి ద్వారా తిరుమలకు
సోమవారం సాయంత్రం సమంత తిరుపతిలోని అలిపిరి వద్దకు చేరుకొని కాలినడకన తిరుమల చేరుకొన్నారు. కాలి నడకన వెళ్లిన సమంత వెంట ఆమె సన్నిహితులు, వ్యక్తిగత సిబ్బంది, అభిమానులు తోడుగా వెళ్లారు. దారి పొడుగున పలకరించిన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు.

వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం
కలియుగ వైకుంఠం తిరుమలకు చేరుకొన్న సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మంగళవారం ఉదయం భగవంతుడిని దర్శించుకొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత దంపతులు శ్రీవారిని దర్శించుకొన్నట్టు సమాచారం.

పెళ్లి తర్వాత మొక్కు చెల్లింపు
పెళ్లి తర్వాత మొక్కు పెండింగ్‌లో ఉండటం, గతేడాది వరుస విజయాలు, ఈ ఏడాది సూపర్ డీలక్స్‌తో ఘనంగా ప్రారంభం కావడంతో ఆమె తిరుమల సందర్శనకు కారణమైందని సన్నిహితులు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ 5న మజిలీ కూడా విడుదలవుతుండటంతో తన సినిమా విజయం సాధించాలని కోరుకొన్నట్టు తెలిసింది.

తదుపరి సినిమాలపై సమంత అక్కినేని
సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాల తర్వాత ఓ బేబీ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రం మే నెలలో ప్రారంభం కానున్నది. దాని అనంతరం తమిళంలో ఘన విజయం సాధించిన 96 మూవీ రీమేక్‌లో నటిస్తారు. సమంత ఏప్రిల్ నెల మొత్తం వెకేషన్‌కు కేటాయించినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











