బుడ్డోడి డాన్స్ చూసి సమంత ఫిదా.... కిడ్నాప్ చేస్తానంటూ ట్వీట్!
సమంత నటించిన 'రంగస్థలం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇందులో రామ లక్ష్మి పాత్రలో సమంత పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులోని పాటలకు సమంత వయ్యారాలు ఒలకపోసిన తీరు చూసి అభిమాన లోకం ఫిదా అయింది. 'రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..' ఈ సాంగులో అయితే సమంత అదరగొట్టిందనే చెప్పాలి. తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు డాన్స్ చేసిన వీడియో సమంతకు తెగ నచ్చేసింది. ట్విట్టర్లో ఈ వీడియో చూసిన వెంటనే 'ఈ క్యూటీని కిడ్నాప్ చేస్తాను' అంటూ ట్వీట్ చేసింది.
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు... పాటకు ఈ బుడ్డోడు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియో వీక్షించారు. చూసిన ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం తమిళంలో సీమరాజా, సూపర్ డిలక్స్ చిత్రాలతో పాటు తెలుగులో యూ టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది.



Click it and Unblock the Notifications











