సమంత హేట్ యూ... టీడీపీకి మద్దతుపై దారుణంగా: మంచోడైతే గెలుస్తాడుగా.. శతృవులుగా పవన్ ఫ్యాన్స్ !

వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేనికి పొలిటికల్ పంచ్ గట్టిగానే పడుతున్నది. మజిలీ చిత్రం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రధాన పార్టీకి ఓటు వేయాలని బహిరంగంగా మద్దతు తెలుపుతూ వీడియోను సోషల్ మీడియాలో ఇటీవల రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోను ఉద్దేశించి సమంతను నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. సమంతను ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇవే...

ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్

ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్

రాజకీయపార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆయనకు సమంతకు ఏమిటి సంబంధం.. ఫ్యామిలీ ఫ్రెండా అని ప్రశ్నించడంపై సమంత స్పందించారు. అవును.. ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్. వ్యక్తిగతంగా నా సపోర్ట్ ఆయనకే. ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు బాగా తెలుసు. ఆయన మంచి వ్యక్తి కావడం వల్లే నేను ఆయనకు మద్దతు తెలుపుతున్నాను అని సమంత చెప్పింది.

నీ కెరీర్‌కు ముప్పని తెలుసా

నీ కెరీర్‌కు ముప్పని తెలుసా

సమంత మద్దతుపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీలకు బహిరంగ మద్దతు ఇచ్చే విషయంలో తలదూర్చకు. నీ కెరీర్‌కు పెద్ద ముప్పు అవ్వొచ్చు. మెజారిటీ వర్గాలకు ఇది నచ్చుదు. మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు అని సమంతకు సూచించారు.

 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ శతృవులుగా

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ శతృవులుగా

టీడీపీకి మద్దతిస్తే మీ సినిమా కలెక్షన్లు పడిపోవొచ్చు. పవన్ కల్యాణ్, ఇతర పార్టీల అభిమానులు మీకు శతృవులుగా మారవచ్చు. ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని సమంతకు సలహా ఇచ్చారు. ఇలా ట్వీట్ల వర్షం ఆమె వాల్‌పై కనిపిస్తున్నది.

ఐ హేట్ యూ సమంత

ఐ హేట్ యూ సమంత

రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపినందుకు ఐ హేట్‌ యూ. నిన్ను ఫాలో కావడం ఆపేస్తున్నాను. మీకు మంచి జీవితం ఉండాలని కోరుకొంటున్నాను. నీకు సంబంధించిన ప్రతీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం నుంచి అన్ ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు మంచి చిత్రాలు అందించినందుకు థాంక్స్. ఇక నుంచి నీ సినిమాలు చూడను. నీవు మంచి ఫ్యాన్‌ను కోల్పోయావు. నీ నుంచి ఇలాంటిది ఊహించలేదు. నీవు చెప్పిన పార్టీకి ఓటు ఎలా వేస్తాను అని ఓ నెటిజన్ మండిపడ్డాడు.

నీకు ఇష్టమైతే అలా చెబుతావా?

నీకు ఇష్టమైతే అలా చెబుతావా?

ఇకవేళ నీకు ఆ పార్టీ అభ్యర్థి ఇష్టమైతే.. నీవు అతడి పేరు మాత్రమే చెప్పాల్సింది. అలా బహిరంగంగా పార్టీ గుర్తును ఎలా చెబుతావు. ఇలాంటి తప్పులు ఎందుకు.. ఎలా చేశావు. నీకు తెలుగులో పవర్‌ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి సమస్యల్లో తలదూర్చకు అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

మంచోడైతే... గెలుస్తాడు

మంచోడైతే... గెలుస్తాడు

నీవు సపోర్ట్ చేసిన వ్యక్తి మంచి మనిషి అయితే తప్పుకుండా గెలుస్తాడు. నీవు మద్దతు తెలపడం ఎందుకు? ఇప్పటి వరకు నేను నీకు పెద్ద ఫ్యాన్‌ను. ఇక నుంచి అన్‌ఫాల్ అవుతున్నాను. నాకు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి అని మరో నెటిజన్ నిలదీశాడు.

మీకు ప్రజా సమస్యలు తెలుసా?

మీకు ప్రజా సమస్యలు తెలుసా?

సమంత గారు.. మీరు ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం సరే.. కానీ ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి. అక్కడి ప్రజల సమస్యలు ఏమిటి? ఎలాంటి ఇబ్బందులతో ఓటర్లు బాధపడుతున్నారు అనే విషయాలు మీకు తెలుసా? అని ఓ నెటిజన్ గట్టిగా ప్రశ్నించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X