twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీచ్ రిసార్టులో హాట్‌ హాట్‌గా సమంత.. వయసును ఓడించావు మామ అంటూ..

    |

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అప్పుడే 60వ పడిలోకి ప్రవేశించాడు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కినేని నాగార్జున కుటుంబం విదేశాల్లో విహారయాత్ర చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నాగార్జున నవ మన్మథుడిలా కండలు చూపిస్తూ జీవితాన్ని ఆస్వాదించాడు. అయితే అక్కినేని కోడలు సమంత కూడా ఈ పర్యటనలో హాట్ హాట్ దుస్తులతో సందడి చేసింది. ప్రస్తుతం పొట్టి దుస్తుల్లో సమంత ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    హాట్ హాట్‌గా సమంత

    హాట్ హాట్‌గా సమంత

    ప్రస్తుతం నాగార్జున కుటుంబం స్పెయిన్‌లోని ఐబిజాలో విహార యాత్ర చేస్తున్నది. ఈ సందర్భంగా సమంత హాట్ హాట్‌గా కనిపిస్తూ తీసుకొన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఇన్స్‌టాగ్రామ్‌లోని బీచ్ రిసార్ట్ ఫోటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సమంత అందాలు ఇంటర్నెట్‌ను వేడెక్కిస్తున్నాయి.

    నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు

    నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు

    సమంత తన ఫోటోలతోపాటు నాగార్జునకు ఓ ఆసక్తికరమైన పోస్టును కూడా పెట్టింది. ప్రతీ ఒక్కరు జీవితంలో కోరుకునేవి నీకు లభిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది. నీ చుట్టు ఆనందం ఉన్నప్పుడు మరో రకమైన ఆలోచనలు ఎలా వస్తాయి. నీ అందమైన ఆలోచనలు, నీ సృజనాత్మక ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని పంచుతాయి అని సమంత తన పోస్టులో పేర్కొన్నది.

    మామ నీ వయసు ఓడించావు

    మామ నీ వయసు ఓడించావు

    సమంత తన మామ నాగార్జున కోసం భావోద్వేగమైన జన్మదిన సందేశాన్ని అందించింది. సంతోషంతో ఉండే నీవు ఇతరులకు ఆనందాన్ని పంచుతావు. హ్యాపీ‌నెస్‌తో నీ వయసును ఓడించావు మామ. భావితరాలకు నీవు స్ఫూర్తిగా నిలువాలి అంటూ నాగార్జునకు జన్మదిన సందేశాన్ని అందించారు. నాగార్జున కండలు చూపిస్తూ అర్ధనగ్నంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోను సమంత ట్యాగ్ చేసింది.

    కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సామ్

    కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సామ్

    సమంత కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లింది. రంగస్థలం, అభిమన్యుడు లాంటి చిత్రాలతో రికార్డుల మోత మోగించింది. 2019 ఏడాదిని కూడా ఘనంగా సమంత ఆరంభించింది. సూపర్ డీలక్స్, ఓ బేబి లాంటి సినిమాలతో విజయాలను సొంతం చేసుకొన్నది. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి 96 అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నది.

    English summary
    Nagarjuna celebrated his 60th birthday along with his entire family in Spain. Samantha took to Instagram to share a few pics from the celebrations. She greeted Nagarjuna that you have defeated age my mama .. #happybirthdaykingYou will continue to inspire generation after generation .. you are pure goals (sic)."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X