For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha, Naga Chaitanya Marriage day..విడిపోకుండా ఉంటే.. పెళ్లి రోజున సమంత, చైతూ ఏం చేసేవారంటే..

  |

  దక్షిణాదిలో అగ్రతారలు నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం సినీ వర్గాలను, అభిమానులను నివ్వెరపాటుకు గురి చేసింది. అయితే సమంత, చైతూ విడిపోకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకొన్నారు. ముచ్చటైన జంటగా గుర్తింపు పొందిన ఆ ఇద్దరి జీవితాల్లో చోటు చేసుకొన్న ఈ సంఘటనపై అంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడిపోకపోతే ఈ రోజు వారి నాలుగో మ్యారేజ్ డే. ఈ సందర్భంగా వారికి సంబంధించిన ఫోటోలు, విషయాలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి. సమంత, నాగచైతన్య మ్యారేజ్ డే వివరాల్లోకి వెళితే..

  2017 అక్టోబర్ 7న వివాహం

  2017 అక్టోబర్ 7న వివాహం

  సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని వివాహం గోవాలో అక్టోబర్ 7వ తేదీ, 2017లో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు కేవలం ఇరు కుటంబాల సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి జరిగిన వెంటనే సమంత రుత్ ప్రభు తన ట్విట్టర్ బయోను మార్చి వేసి సమంత అక్కినేని అని మార్చుకొన్నారు. దాంతో అక్కినిని వంశంలో ఒకరిగా మారిపోయారు.

  నాలుగేళ్ల వైవాహిక జీవితంలో

  నాలుగేళ్ల వైవాహిక జీవితంలో

  ఇక సుమారు నాలుగేళ్ల వివాహిక జీవితంలో సోషల్ మీడియా, ఇతర ప్రధాన మీడియాలను పరిశీలిస్తే చైతూ, నాగచైతన్య అన్యోన్యయంగా ఉంటున్నట్టు కనిపించారు. లాక్‌డౌన్‌లో వారిద్దరి ఫోటోలు అభిమానులను, ఆకట్టుకొన్నాయి. సామ్, చైతూ రొమాంటిక్ ఫోటోలు వారిద్దరి బంధం ఎంత గట్టిదో అనే భావనను కల్పించాయి. అయితే అనూహ్యంగా గతవారం తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించడం మీడియాను కుదిపేసింది.

  భర్త అంటే ఎనలేని గౌరవం అంటూ

  భర్త అంటే ఎనలేని గౌరవం అంటూ

  గతంలో సమంత ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలను పరిశీలిస్తే.. నాగచైతన్యను సమంత ఎంతగా ప్రేమించేదో స్పష్టమైంది. నా భర్త అంటే ఎనలేని గౌరవం. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి. తనను బాగా అర్ధం చేసుకొంటారు అంటూ సమంత ఎప్పుడూ చెప్పేది. తన జీవితంలో ఏవైనా ఎగుడుదిగుడు రోజులు ఉంటే నాకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇచ్చే వారు అంటూ సమంత చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

  నాగచైతన్య లాంటి భర్త లభించడం అంటూ

  నాగచైతన్య లాంటి భర్త లభించడం అంటూ

  ఇక మహానటి సినిమా ప్రమోషన్ సమయంలో తన జీవితానికి, సావిత్రి జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. సావిత్రి గారి జీవితంలో చోటుచేసుకొన్న అనుభావాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. అలాంటి సంఘటనలను అధిగమించి వచ్చాను. కానీ నాగచైతన్య లాంటి భర్త లభించడం నిజంగా అదృష్టం అంటూ సమంత చెప్పడం తెలిసిందే.

  విడిపోయినా సోషల్ మీడియాలో స్నేహంగానే

  విడిపోయినా సోషల్ మీడియాలో స్నేహంగానే

  కొద్ది నెలలుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు మీడియాను ఊపేసాయి. అయితే వారిద్దరి విడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో స్నేహపూర్వకంగా స్పందించుకోవడం వారి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌కు అద్దం పట్టింది. వైవాహిక జీవితంలో విభేదాలు ఉన్నప్పటికి సమంత, చైతు మధ్య స్నేహ బంధం చెక్కుచెదరలేదనే విషయం స్పష్టమైంది.

  అక్కినేని ఫ్యామిలీతో సన్నిహితంగా

  అక్కినేని ఫ్యామిలీతో సన్నిహితంగా


  నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా సమంతకు అక్కినేని ఫ్యామిలీలో కొందరితో మంచి సంబంధాలు ఉన్నట్టు ఇటీవల ఆమె చేసిన ట్వీట్లు స్పష్టం చేశాయి. తమ విడాకులకు ముందు మామ అంటూ నాగార్జునను సమంత ట్విట్టర్‌లో సంభోధించడం కనిపించింది. విడాకులు అధికారిక ప్రకటన తర్వాత నాగార్జున స్పందిస్తూ.. సమంత, నాగచైతన్య విడిపోవడం దురదృష్టకరం. వారి నిర్ణయాను గౌరవించాల్సిందే. సమంత అంటే ఇప్పటికీ నాకు గౌరవం, అభిప్రాయం ఉందని నాగార్జున తన ట్వీట్‌లో వ్యక్తం చేశారు.

  సమంత, నాగచైతన్య విడిపోకుండా ఉంటే..

  సమంత, నాగచైతన్య విడిపోకుండా ఉంటే..

  ఒకవేళ సమంత, నాగచైతన్య విడిపోకుండా ఉంటే.. ఇప్పటికే వారిద్దరూ విదేశాలకు వెళ్లి ఉండేవారు. ఒకరి పట్ల మరొకరు ప్రేమను కురిపించుకొనే వారు. గిఫ్టులు అందించుకొంటూ జీవితాన్ని ఆస్వాదించే వాళ్లు. అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు విషెస్ అందించేవారు. కానీ దురదృష్టవశాత్తు వారిద్దరూ తమ నాలుగో వార్షికోత్సవానికి ముందు కొద్ది రోజుల ముందు విడిపోవడం బాధాకరంగా మారింది.

  Recommended Video

  Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Filmibeat Telugu
  సమంత, చైతూ కెరీర్స్ ఇలా

  సమంత, చైతూ కెరీర్స్ ఇలా


  ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. నయనతార, విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నారు. నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన లవ్ స్టోరి చిత్రం రిలీజై ఘనవిజయం సాధించింది. అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నారు. థ్యాంక్యూ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

  English summary
  South Film Industries top celebritties Samantha and Naga Chaitanya' 4th Marriage day. they have annouced divorce officially. Here some Interesting facts about South's top celebrities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X