ఏదైనా అలానే చేస్తాం.. అదే మా మంత్రమంటూ ఆ పనిలో నిమగ్నమైన చై-సామ్‌

సమంత, నాగచైతన్యలు వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా సందడి చేస్తుంటారు. అదేంటి బుల్లితెరపైనా? అని ఆశ్చర్యపోతున్నారా?.. అదేనండి వీరిద్దరు కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్ని ఉత్పత్తుల ప్రకటనల్లో కలిసి నటించడం గురించి చెబుతున్నాం. వీరిద్దరూ కలిసి సూపర్ మార్కెట్, సబ్బులకు సంబంధించిన ప్రకటనల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యాడ్ కోసం వీరిద్దరు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సమంతో షేర్ చేసిన ఫోటోలు పెట్టిన క్యాప్షన్‌ అదిరిపోతోంది.

ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా విజృంభణ ఉండటంతో బయటకు రావడం లేదు స్టార్స్. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన సెలెబ్రిటీలెవ్వరూ బయటకు రావడం లేదు. టీవీ ఇండస్ట్రీలో అసలే కరోనా వ్యాప్తి చెందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో స్టార్స్ ఎవ్వరూ కూడా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. కానీ చై-సామ్ మాత్రం ఓ యాడ్ షూటింగ్‌కు రెడీ అయ్యారు. అయితే ఇది ఇండోర్ షూటింగ్‌లా కనిపిప్తోంది. వారి ఇంట్లోనే ఈ ప్రకటనకు సంబంధించిన షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Samantha And Naga Chaitanya For Ariel Ad Shoot

తాజాగా సమంత నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో వీరిద్దరు వాషింగ్ మెషీన్ వద్ద ఉండగా.. పనులు పంచుకుంటున్నామని చెప్పుకొచ్చింది. పని భారాన్ని పంచుకోండని చెబుతూ.. సమానమైన భాగస్వామ్యం.. ప్రతీదీ పంచుకోవాలి.. అదే మా మంత్రం.. నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా సరే. అది సంతోషమైన సరే, ఫుడ్ అయినా సరే, చివరకు బట్టలు ఉతకడం అయినా సరే అంటూ ఏరియల్ యాడ్ షూట్ అని తెలిపింది. ఇందులో చై-సామ్ చూడముచ్చటగా ఉన్నారు. ఈ లాక్ డౌన్‌లో వీరిద్దరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరి కరోనా సోకిందనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X