అందుకే బికినీ వేసాను: తెగింపుగా మాట్లాడిన సమంత
హైదరాబాద్: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పద్దతిగానే కనిపించింది. ఆ మధ్య కొన్ని సినిమాల్లో ముద్దు సీన్లలో నటించినా ఆమె హోమ్లీ ఇమేజ్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే ఇటీవల విడుదలైన ‘సికిందర్' చిత్రంలో మాత్రం గ్లామర్ డోసు పెంచింది. ఏకంగా బికినీలో అందాలు ఆరబోసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
‘సికిందర్' చిత్రంలో సమంత బికినీ అందాల ఆరబోత అభిమానులకు కన్నుల విందు చేసింది. బికినీలో సమంత చాలా హాండ్ అండ్ సెక్సీగా ఉందంటూ కొందరు ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం ఆమె అందాల డోసు కాస్త ఎక్కువైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించింది సమంత.

బికినీ గురించి సమంత మాట్లాడుతూ.....‘నాపై ఇప్పటి వరకు హోమ్లీ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ బ్రేక్ చేయడానికే బికినీ వేసాను. గ్లామర్ పాత్రలతో పాటు అన్ని రకాల పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతోనే బికినీ వేయడానికి ఒప్పుకున్నాను' అని సమంత చెప్పుకొచ్చింది.
యువ హీరోలకు సమంత అంటే మయక్రేజ్: క్లిక్ చేయండి
నా విషయంలో ‘సికిందర్'కు సంబంధించి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇదంతా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ వల్లే సాధ్యమైంది. అందుకు థాంక్స్ చెబుతున్నాను. ఈ చిత్రంలో నన్ను ఆయన చాలా అందంగా ప్రజెంట్ చేసారు......అంటూ బికినీ వేయడాన్ని సమర్థించుకుంది సమంత.


Click it and Unblock the Notifications










