Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వీడియో: మధురవాణిగా సమంత ఎలా మారిందంటే.. కళ్ళజోడు కోసమే!
మహానటి చిత్రం విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. లెజెండరీ నటి సావిత్రి జీవిత గాధగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులందరిని మెప్పిస్తోంది. మహానటిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. నాగ అశ్విన్ దర్శకత్వంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. మధురవాణిగా సమంత మెప్పించింది. విజయ్ దేవర కొండ కూడా కీలక పాత్రలో నటించాడు.
చిత్రం విడుదలయ్యాక కూడా మహానటి యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని చేపడుతోంది. మధురవాణి పాత్ర వెనుక జరిగిన కసరత్త, సమంత ఎలాంటి హోమ్ వర్క్ చేసింది అనే అంశాలకు సంబందించిన వీడియోని తాజగా విడుదల చేసారు. డ్రెస్సింగ్, హావభావాలు, పాతకాలం జర్నలిస్టుగా ఎలా ఉండాలి అనే అంశాలన్నిటినీ ముందే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.
కళ్ళజోడు, డ్రెస్సింగ్ విషయంలో సమంత చూపిన శ్రద్ద ఈ వీడియోలో కనిపిస్తోంది. షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండతో సరదా ఘటనలు ఈ వీడియోలో చూపించారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వెనుక ఉండి నడిపించగా, ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్ మహానటి చిత్రాన్ని నిర్మించారు.