సాయి కుమార్ కూతురుగా సమంత
త్వరలో సమంత కు తండ్రిగా సాయికుమార్ కనిపించి అలరించనున్నారు. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటోనగర్ సూర్య'లో ఈ పాత్రను వేయనున్నారు. ఈ విషయమై సాయికుమార్ మాట్లాడుతూ...'ప్రస్థానం' తరవాత దేవాకట్టా 'ఆటోనగర్ సూర్య'లో గుర్తుండిపోయే వేషం మళ్లీ ఇచ్చాడు. సమంతకు నాన్నగా కనిపించనున్నా అన్నారు. నాగచైతన్య,సమంత కాంబినేషన్ లో విజయవాడ ఆటో నగర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.'ప్రస్థానం'లో తన దైన డైలాగులతో ఆకట్టుకున్న దేవకట్టా ఈ చిత్రంలోనూ తన దైన శైలిలో అదరకొట్టనున్నాడని చెప్తున్నారు. ఇక సాయికుమార్..'వూకొడతారా ఉలిక్కిపడతారా', 'ఎవడు'ల్లో మంచి పాత్రలు దక్కాయి. నటుడు ఎప్పుడూ పరిపూర్ణుడు కాడు. పదికి పది మార్కులు తెచ్చుకొంటే గర్వం వచ్చేస్తుంది. 'ప్రస్థానం'లో నా నటనకు ఏడు మార్కులే వేసుకొన్నా'' అన్నారు. సమంత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రాజమౌళి 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లో నటిస్తోంది. మహేష్‌బాబుతో మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో అవకాశం అందుకొంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడల్ లో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే ఆమెకు చెందిన షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











