మీలో ఎవరు కోటీశ్వరుడు: నాగ్ టీవీ షోలో సమంత కూడా

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది.

ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం ఈ షో టీం మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ ఈ రోజు( డిసెంబర్‌ 8) నుంచి ప్రారంభం కాబోతోంది. రాత్రి 9.30 గంటలకు మాటీవీలో ఈ షో ప్రసారం కానుంది. మొదటి సీజన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజుల పాటు ఈ షో అలరించనుంది.

 Samantha as special guest in Nag’s MEK

ఈ రెండో సీజన్లో పలువురు సినీ సెలబ్రిటీలు మీలో ఎవరు కోటీశ్వరు షోలో స్పెషల్ గెస్టులగా దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే నితి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారిపై ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. తాజాగా సమంత కూడా ఈ లిస్టులో చేరారు. ఇటీవలే ఆమె ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X