»   » వావ్...బంగారు బొమ్మలా సమంత (ఫోటోలు)

వావ్...బంగారు బొమ్మలా సమంత (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడున్న హీరోయిన్లందరిలోకెల్లా అందగత్తె ఎవరంటే ఎక్కువ మంది ముందుగా చెప్పే పేరు సమంత. అందమే కాదు, ఆకట్టుకునే అభినయమూ సమంత సొంతం. గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను సమ్మోహనులను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సమంత....తాజాగా మరోసారి అందాల బంగారు బొమ్మలా దర్శనం ఇచ్చి అందరి మతి పోగొట్టింది.

60వ తెలుగు ఫిల్మ్ ఫేర్ సౌతిండియా నామినేషన్ల వివరాలు గురువారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో హాజరైన సమంత అందాల భరిణెలా మెరిసి పోయింది. ఆమె అదం చూసి మైమరిచిపోయి వారు అక్కడ లేరంటే అతిశయోక్తి కాదేమో!

ఈ నెల 20న జరిగే ఫంక్షన్లో విజేతలకు పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది. స్లైడ్ షోలో నామినేషన్ల వివరాలు...


గబ్బర్ సింగ్, బిజినెస్ మేన్, ఈగ, జులాయి చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగానికి పోటీ పడుతున్నాయి.


గబ్బర్ సింగ్ చిత్రానికి గాను హరీష్ శంకర్, ఈగ చిత్రానికి గాను రాజమౌళి, జులాయి చిత్రానికి గాను త్రివిక్రమ్ శ్రీనివాస్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గాను క్రిష్, బిజినెస్ మేన్ చిత్రానికిగాను పూరి జగన్నాథ్ ఉత్తమ దర్శకుడి పురస్కారానికి పోటీ పడుతున్నారు.


గబ్బర్ సింగ్ చిత్రంలో నటనకుగాను పవన్ కళ్యాణ్, బిజినెస్ మేన్ చిత్రంలో నటనకుగాను మహేష్ బాబు, రచ్చ చిత్రంలో నటనకుగాను రామ్ చరణ్ తేజ్, డమరుకం చిత్రానికి గాను నాగార్జున, ఇష్క్ చిత్రానికిగాను నితిన్ ఉత్తమ నటుడి పురస్కారానికి పోటీ పడుతున్నారు.


కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గాను నయనతార, రచ్చ చిత్రానికి గాను తమన్నా, దేనికైనా రెడీ చిత్రానికిగాను హన్సిక, డమరుకం చిత్రానికి అనుష్క, ఈగ చిత్రానికిగాను సమంత ఉత్తమ నటి పురస్కారానికి పోటీపడుతున్నారు...


ఈగ చిత్రానికి గాను సుదీప్, డమరుకం చిత్రానికిగాను రవి శంకర్, జులాయి చిత్రానికిగాను రాజేంద్రప్రసాద్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికిగాను పోసాని కృష్ణ మురళి, దేనికైనా రెడీ చిత్రానికిగాను బ్రహ్మానందం ఉత్తమ సహాయ నటుడి విభాగానికి పోటీ పడుతున్నారు.


సుడిగాడు చిత్రానికి గాను కోవై సరళ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికిగాను అమల అక్కినేని, లవ్లీ చిత్రానికిగాను చిన్మయి ఘాట్రాజ్, బాడీగార్డ్ చిత్రానికిగాను సలోని ఉత్తమ సహాయ నటి విభాగానికి పోటీ పడుతున్నారు.


ఈగ చిత్రానికిగాను ఎంఎం కీరవాణి, గబ్బర్ సింగ్ చిత్రానికిగాను దేవిశ్రీ ప్రసాద్, బిజినెస్ మేన్ చిత్రానికిగాను తమన్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికిగాను మణిశర్మ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికిగాను మిక్కీజే మేయర్ ఉత్తమ సంగీత దర్శకుడి విభాగానికి పోటీ పడుతున్నారు.


కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కృష్ణం వందే జగద్గురుమ్ పాటకుగాను సిరివెన్నెల, గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక పాటకుగాను సాహితి పవన్, డమరుకం చిత్రంలో శివశివ శంకర్ పాటకు గాను జొన్నవిత్తుల, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అమ్మా అని కొత్తగా సాంగుకుగాను వనమాలి, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రంలో యేది యేది పాటకుగాను అనంత శ్రీరామ్ ఉత్తమగేయరచయిత విభాగానికి పోటీ పడుతున్నారు.


కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కృష్ణం వందే జగద్గురుమ్ పాటకుగాను ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గబ్బర్ సింగ్ చిత్రంలో గన్నులాంటి కన్నులున్న పాటకుగాను వడ్డేపల్లి శ్రీనివాస్, ఈగ చిత్రంలో నేనే నానినే పాటకుగాను దీపు, జులాయి చిత్రంలో ఓ మధు పాటకు గాను అద్నాన్ సమి, బాడీగార్డ్ చిత్రంలో ఎవరో పాటకుగాను కార్తీక్ ఉత్తమ నేపథ్యగాయుడు విభాగానికి పోటీ పడుతున్నారు.


బిజినెస్ మేన్ చిత్రంలో సారొస్తారొస్తారు పాటకుగాను సుచిత్ర, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో సై అందినాలో పాటకుగాను శ్రేయఘోషల్, షిరిడి సాయి చిత్రంలో అమరా రమ పాటకుగాను శ్వేతా పండిత్, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రంలో అటు ఇటు పాటకుగాను సునీతా చౌహాన్, డమరుకం చిత్రంలో లాలి లాలి పాటకుగాను గోపికా పూర్ణిమ తదితరులు ఉత్తమ గాయని విభాగానికి పోటీ పడుతున్నారు.

English summary
South Indian Actress Samantha at 60th Idea Filmfare Awards (South) Nominations Announcement Press Meet held at Marriot Hotel, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu