సమంత సెక్సీ సోయగం అదిరింది (ఫోటోలు)
హైదరాబాద్ : ప్రజెంట్ జనరేషన్లో సౌతిండియా హాట్ హీరోయిన్లలో, ముఖ్యంగా తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. తాజాగా ఆమె 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుండటంతో సమంత పాపులారిటీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.
తాజాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్రం ఆడియో వేడుకకు హాజరైన సమంత సాంప్రదాయ దుస్తువుల్లో హజరై తన సెక్సీ సోయగాలతో అభిమానులను, ఆడియో వేడుకకు వచ్చిన వారిని మంత్ర ముగ్దులను చేసింది. ఈ వేడుకలో పవర్ స్టార్ తర్వాత మెయిన్ అట్రాక్షన్‌గా మారింది సమంత.
'అత్తారింటికి దారేది' చిత్రంలో సమంత శశి పాత్రలో పవన్ కళ్యాణ్ మరదలు పాత్రలో నటిస్తోంది. సమంత తల్లి పాత్రలో నదియా నటిస్తోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, సమంత ఫోటోలు.....

సినిమాకు సమంత సెంటరాఫ్ అట్రాక్షన్
అత్తారింటికి దారేది చిత్రానికి సమంత సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారనుంది. ఈచిత్రంలో ఆమె శశి పాత్రలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో తన అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత అత్తారింటికి దారేది చిత్రంలోనూ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతోంది.

పవన్ కళ్యాణ్ మరదలుగా
ఈ చిత్రంలో సమంత పవన్ కళ్యాణ్ మరదలు పాత్రలో నటిస్తోంది. సమంత తల్లి పాత్రలో, పవన్ కళ్యాన్ అత్త పాత్రలో నదియా నటిస్తోంది. సినిమాలో నదియా పాత్ర ఎంతో కీలకమైనది. సినిమాలో పవన్ కళ్యాన్, సమంత, నదియా మధ్య సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

త్రివిక్రమ్ మాటలు మాయ చేసాడన్న సమంత
ఈ సినిమా మొత్తం మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలోని డైలాగులు మాటలతో మాయ చేసే విధంగా రాసాడని, సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, సినిమా అందరికీ మంచి వినోదాన్ని పంచుతుందని తప్పక చెప్పగలను అని వెల్లడించారు.

సమంత ద్వారా సినిమా విషయాలు బయటకు
అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సమంత తన ట్విట్టర్ ద్వారా ఎప్పుటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూ......అందరిలో ఉత్సాహాన్ని పంచేది. దీంతో సమంతను ట్విట్టర్లో ఫాలోఅయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరింది.

టైటిల్ లీక్ చేసిన సమంత
‘అత్తారింటికి దారేది' చిత్రం టైటిల్ మొదట మీడియాకు, అభిమానులకు లీక్ చేసింది సమంతనే. ఆమె తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది. ఆ మధ్య ఇది తాత్కాలిక టైటిల్ అని ప్రచారం జరిగినప్పటికీ....చివరకు అదే టైటిల్ ఖరారు చేసారు.

మెగా అభిమానులకు ఫేవరెట్ అయిన సమంత
‘అత్తారింటికి' దారేది చిత్రంతో తొలిసారిగా పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న సమంత మెగా అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత కూడా ఆమె ఇతర మెగా హీరోలతో చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సమంతతో పాటే ఆమె స్టైలిస్ట్
సమంత స్టైలిస్టుగా కోన వెంకట్ చెల్లెలు కోన నీరజ ఇటీవల నియమితమై మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రం ఆడియో వేడుకలో కోన నీరజ ఆమె వన్నంటి, సహాయకురాలిగా ఉండటం కనిపించింది.

అందరితో సందడిగా సమంత
సమంత ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. అది షూటింగ్ సమయంలో అయినా ఇతర సందర్భాలైనా. ఆమె అందరితోనూ కలివిడిగా, సరదా ఉంటుందని అత్తారింటికి దారేది యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆడియో వేడుక కార్యక్రమంలో ఆమె అదే తరహా బిహేవియర్‌తో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











