జగపతిబాబు ఇంటికి చేరిన సమంత
హీరోయిన్ సమంత జగపతిబాబు ఇంటికి చేరింది. ఆమెకు జగపతిబాబుతో ఎలాంటి పని, అవసరం లేకున్నా ఆమె ఇక్కడికి రావడానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం సమంత దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్-మహేష్ బాబు మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో సమంత మహేష్ బాబు భార్యగా నటించబోతోంది.
ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. వైజాగ్ లో వెంకీపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. మరో వైపు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని జగపతిబాబు ఇంట్లో సమంతపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు. హీరో మహేష్ బాబు ఫిబ్రవరి 9న సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి నటించనుంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ప్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా జయసుధ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిన్తున్నారు. శ్వేతాబసు ప్రసాద్ వెంకీ, మహేష్ చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. మిక్కీజె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











