పవన్ ఫ్యాన్స్ చారిటీ కార్యక్రమంలో సమంత (ఫోటోలు)
హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చారిటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ చిత్ర హీరోయిన్ సమంత హాజరయ్యారు. సమంత చేతుల మీదుగా ఓ చిన్నారికి సహాయం అందించారు. ఈ సందర్భంగా సమంత అభిమానులను ప్రశంసించింది.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.
సైడ్ షోలో ఫోటోలు, అత్తారింటికి దారేది రికార్డుల వివరాలు..

హయ్యెస్ట్ గ్రాసర్
‘అత్తారింటికి దారేది' చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాసర్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 85 కోట్లకు పైగా షేర్ సాధించి 100 కోట్లు వసూలు చేసే దిశగా పరుగులు పెడుతోంది.

ఇతర రికార్డులు
అన్ని ఏరియాల్లోనూ ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ ఆల్ టైం రికార్డ్ - నైజాం ఏరియాలో అతి తక్కువ కాలంలో కేవలం 5 రోజుల్లోనే 10 కోట్లు వసూలు - ఏపీలో కేవలం 4 రోజుల్లో 25 కోట్లు వసూలు చేసిన చిత్రం - విడుదలైన కేవలం 5 రోజుల్లోనే 40 కోట్లు వసూలు(అన్ని ఏరియాల్లో కలిపి) -టాప్ 3 సౌత్ ఇండియా చిత్రాల్లో స్థానం.

ప్రధాన ఏరియాల్లో
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రధాన ఆదాయం వచ్చే నైజాం, సీడెడ్, ఓవర్సీస్‌లో 10 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రం ‘అత్తారింటికి దారేది'.

ఓవర్సీస్ మార్కెట్లో సంచలనం
ఓవర్సీస్ మార్కెట్లో ‘అత్తారింటికి దారేది' చిత్రం పలు సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్ వసూళ్ల విషయంలో నెం.1 స్థానం సంపాదించుకుంది. -యూఎస్ఏలో 2013 సంవత్సరంలో భారీ పెనింగ్స్ సాధించి టాప్ 3 ఇండియన్ చిత్రాల్లో స్థానం

పవన్ నెక్ట్స్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.


Click it and Unblock the Notifications











