మహేష్ బాబు దుస్తులు వేలం వేస్తున్న సమంత
హైదరాబాద్ : హీరోయిన్ సమంత ప్రత్యూష పౌండేషన్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి, తద్వారా వచ్చే డబ్బును 'ప్రత్యూష ఫౌండేషన్' కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారు.
ఇప్పటికే 'గబ్బర్ సింగ్' డ్రెస్ వేలం వేస్తున్నట్లు ప్రకటించిన సమంత, తాజాగా 'దూకుడు' చిత్రంలో మహేష్ బాబు ధరించిన దుస్తువులను కూడా వేలం చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వేలం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ ప్రారంభించబోతున్నట్లు, త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమంత పేర్కొన్నారు.
ప్రత్యూష ఫౌండేషన్లో సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నారు. పిల్లలు, మహిళ సాధికారత కోసం ఈ ఆర్గనైజేషన్ పని చేస్తోంది. ఇందుకోసం నిధులు సేకరించే పనిలో ఉంది సమంత. ఇందులో భాగంగా సినిమాల్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా వచ్చిన డబ్బులను ప్రత్యూష ఫౌండేషన్ తరుపున జరిగే సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తారట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. పలువురు పాపులర్ స్టార్లకు సంబంధించిన వస్తువులను ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.


Click it and Unblock the Notifications











