సమంత ప్యాన్స్ కు హ్యాపీ న్యూస్

By Srikanya

హైదరాబాద్ : దాదాపు రెండు నెలలు పాటు అనారోగ్యంతో వెండి తెరకు దూరమై అభిమానులను కలవరపెట్టింది సమంత. గత నెల 20 నుంచి తిరిగి షూటింగ్ లలో పాల్గొంటానని ట్వీట్ కూడా చేసింది. అయితే నెల కావొస్తున్నా ఆ సూచనలు కనపడకపోవటంతో ఫ్యాన్స్ కలవరపడ్డారు. దాంతో ఆమె కెరీర్ పై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె ఆగస్టు 15 నుంచి షూటింగ్ లలో పాల్గొని అందరికీ రిలీఫ్ ఇచ్చింది. అటు నిర్మతలకు,దర్శకులకు,ఇటు అభిమానులకు ఆమె తిరిగి సెట్స్ మీదకు రావటం ఆనందమైంది.

రెండు నెలలు పాటు షూటింగ్ లకు దూరంగా గడిపింది సమంత. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ చెన్నై చిన్నది విశ్రాంతి తీసుకొంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఆటోనగర్‌ సూర్య', 'ఎవడు' లాంటి పలు చిత్రాల్లో ఆమె హీరోయిన్. ఈ విశ్రాంతి మూలంగా చిత్రాల ప్రణాళికలు మారాయి. మంగళవారం ట్రైల్ షూట్ లో పాల్గొని బుదవారం నుంచి మళ్లీ సమంత షూటింగ్ లకు హాజరవుతోంది. నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సిద్ధార్థ్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా సన్నివేశాల చిత్రీకరణలో సమంత పాల్గొంది.

సమంత హుషారుగానే ఉందనీ త్వరలోనే గౌతమ్‌ మీనన్‌ చిత్రం కోసం వెళ్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 'సీతమ్మ వాకిట్లో...' బృందంతో కలుస్తుందని సమాచారం. కొన్ని రోజులు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొని, అనంతరం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తున్న 'ఎటో వెళ్లిపోయింది మనసు' షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం.

''నా కలలు నిజమవుతున్న సమయంలో కొన్ని పీడకలలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అవి భరించడం కష్టమే. కానీ ఎదుర్కొంటాను. మళ్లీ మామూలుగా అవుతాను'' అని దాదాపు నెల క్రితం సమంత ట్వీట్ చేసారు. ఆమె ఈ విధంగా ఆమె పేర్కొడానికి కారణం 'అలర్జీ'. అలర్జీకి చికిత్స చేయించుకుంటున్నానని తిరిగి మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటానని ఆమె గత నెల 12న ట్విట్టర్‌లో మరో వార్త పెట్టారు. అయితే ఇన్నాళ్ళకు ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X