సమంత చీర సింగారాలు చూడబోతున్నాం..!
హైదరాబాద్: వరుస అవకాశాలతో సౌతిండియా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత సినిమా కెరీర్ ప్రస్తుతం అద్భుతంగా ఉంది. దీంతో ఆమె వెంట పడుతున్నాయి పలు కార్పొరేట్ సంస్థలు. ఇప్పటికే లక్స్, పారగాన్ లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సమంత.
తాజాగా సమంతతో మరో సంస్థ డీల్ కుదుర్చుకుంది. శిల్పకళా సారీస్ తరుపున సమంత ప్రచారం చేయబోతోంది. సమంత ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇకపై ఆ సంస్థ చీరలు ధరించి సెక్సీ ఫోటో షూట్లలో పాల్గొనబోతోంది సమంత. సో అభిమానులకు ఇదొ శుభ వార్తలే అన్నమాట.
శిల్పకళా సారీస్ ధరించి సమంత అందాలు ఆరబోయ బోతోందన్నమాట....

సమంత
ప్రస్తుతం సమంత తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

అల్లుడు శ్రీను
సమంత నటించిన ‘అల్లుడు శీను' చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. బెల్లకొండ తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

రభస
మరో వైపు జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘రభస' చిత్రంలోనూ సమంత నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు.

తమిళ సినిమాలు
తమిళంలో సూర్యకు జోడీగా సమంత సమంత నటించిన ‘సికిందర్' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. దీంతో పాటు ఏఆర్ మురుగదాస్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











