ఓకే ...సమంత 'బికినీ' వేసిన కారణం ఇదా?

By Srikanya

హైదరాబాద్: సమంత రీసెంట్ గా 'సికిందర్‌' చిత్రంలో బికినీ వేసి అందరి దృష్టీనీ అకర్షించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఆమె అందాల ప్రదర్శన అంతా బూడిదిలో పోసినట్లు అయ్యింది. ఈ నేపధ్యంలో హోమ్లీ ఇమేజ్ ఉన్న ఆమె బికినీ వేయటం పట్ల కొందరినుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ విషయమై ఆమె అలా బికిని వేసి, అందాల ప్రదర్శన ఎందురు చేయాల్సి వచ్చిందో చెప్పింది.

సమంత మాట్లాడుతూ.... ''నేను గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటే 'సమంతకు గ్లామర్‌ పాత్రలు సరిపడవా.. ఎప్పుడూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తోంది' అంటున్నారు. నేను అన్ని రకాల పాత్రలకు సరిపోతాను అని చెప్పడమే నా ఉద్దేశం. దీంతోపాటు ప్రస్తుతం పరిశ్రమలోకి కొత్త హీరోయిన్స్ చాలామంది వస్తున్నారు. వారికి ధీటుగా నిలబడాలంటే ఇలాంటివి చేయాల్సిందే. అప్పుడే పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండగలుగుతాం'' అని చెప్పింది.

Samantha Bikini can’t Save Movie

అలాగే ''నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు, నా పాత్రలు నన్ను క్లాస్‌ సినిమాల హీరోయిన్ గా పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్‌ సినిమాలు ఎక్కువగా ఇష్టపడే 'బి', 'సి' సెంటర్లలోనూ అభిమానులతో శభాష్‌ అనిపించుకోవాలని ఉండేది. ఆ ఆలోచన తోనే తాజా చిత్రాలు ఎంచుకుంటున్నాను'' అంటోంది సమంత.

ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవల సినిమాల్లో గ్లామర్‌ పాళ్లు కాస్త పెంచింది. ఈ మధ్య వచ్చిన 'అల్లుడు శీను','సికిందర్‌'.. త్వరలో రాబోతున్న 'రభస'లో అందాల ప్రదర్శనకు సమంత గేట్లు ఎత్తేసింది. ఇప్పుడు అందరి దృష్టీ 'రభస' పైనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X