»   » బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ సమంత

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు ఆమె దక్షిణాది సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అతి తక్కువ కాలంలోనే ఇక్కడ స్టార్ హీరోయిగా ఎదిగింది. అయితే బాలీవుడ్ చిత్ర సీమ వైపు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. బాలీవుడ్‌కి వెళ్లే ఉద్దేశ్యం కూడా లేదని ఆ మధ్య సమంత చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తనకు సినిమా పరిశ్రమలో 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా లైఫ్ ఇచ్చిన గౌతం మీనన్ మాట కాదనలేక ఇపుడు బాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది సమంత. గౌతం మీనన్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రాన్ని హిందీలో 'అస్సి నబ్బే పూరే సౌ' పేరుతో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Samantha bollywood debut in 'Assi Nabey Poore Sau'

ఈ చిత్రాన్ని ఆదిత్యా రాయ్ కపూర్, సోనమ్ కపూర్ జంటగా ప్లాన్ చేసారు. అయితే సోనమ్ కపూర్ తప్పుకోవడంతో.....తెలుగు వెర్షన్లో నటించిన సమంతనే తీసుకోవాలని అనుకుంటున్నాడు గౌతం మీనన్. గతంలో దక్షిణాదిన హిట్టయిన 'ఏ మాయ చేసావె' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న మీనన్....ఈ సారి హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. హిందీ నేటివిటీకి తగిన విధంగా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

కాగా...సమంత ప్రస్తుతం పలు సౌత్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సమంత నటించిన అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం', నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఆటో నగర్ సూర్య చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు దర్శకుడు వివి వినాయక్...బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా సమంతే హీరోయిన్. 'జులాయి' తర్వాత అల్లు అర్జున్‌తో దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్ చేసారు. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది.

English summary
Samantha, who has earlier made a guest appearance in Gautham Menon's Hindi Ekk Deewana Tha, is now all set to debut as heroine with the movie Assi Nabbe Poorey Sau, which is the Bollywood version of Yeto Vellipoyindi Manasu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu