»   » బీఎండబ్ల్యూ కారు కొన్న నటి సమంత: హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్(పిక్చర్స్)

బీఎండబ్ల్యూ కారు కొన్న నటి సమంత: హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్(పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్ సమంత తన అభిరుచికి తగిన విధంగా మరో కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎండబ్ల్యు ఎక్స్‌5 మోడల్‌ ను కొనుగోలు చేసిన సమంత రిజిస్ట్రేషన్‌ కోసం బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయాని వచ్చారు. ఆమె కారు ఖరీదు రూ.76.41లక్షలు. రిజిస్ట్రేషన్ సందర్భంగా టీఎస్‌ 09 ఇహెచ్‌ 3888 అనే ఫ్యాన్సీ నెంబరు కోసం ఆమె అదనంగా రూ.26,500ను చెల్లించారు.

సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం'తో పాటు తమిళంలో ఐదు సినిమాల్లో నటిస్తోంది. మరో తమిళ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది.

విక్రమ్ కు జోడీగా సమంత నటించిన తమిళ చిత్రం ‘10 ఎంద్రాతుకుల్లా' చిత్రం అక్టోబర్ 21న విడుదల కు సిద్ధమవుతోంది. దీంతో పాటు ధనుష్ హీరోగా వేల్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ సమంత నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘24' సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీంతో పాటు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంత నటిస్తోంది. ఆమె నటించబోయే వడ చెన్నై సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

సమంత సందడి

సమంత సందడి

దక్షిణాది నటి సమంత బుధవారం నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

సమంత సందడి

సమంత సందడి

కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగారు.

సమంత సందడి

సమంత సందడి

డిజిటల్ ప్యాడ్‌పై సంతకం కూడా చేశారు. ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎస్ ప్రసాద్ ‘టీఎస్ 09 ఈహెచ్ 3888' నెంబర్‌ను కేటాయిస్తూ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారు.

సమంత సందడి

సమంత సందడి

హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి. రఘునాథ్, ఆర్టీఓలు, ఉద్యోగులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.

    English summary
    Samantha has bought a new BMW x5. BMW x5 is the one of the finest luxury car.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu