జాగ్రత్త సుమీ: సమంత చెప్పుతో సమాధానం ఇస్తుంది!
హైదరాబాద్: వరుస అవకాశాలతో హీరోయిన్‌గా సమంత ఏ రేంజిలో ఉందో అందరికీ తెలిసిందే. మరో వైపు వాణిజ్య ప్రకటనల విషయంలోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే సమంత లక్స్ సబ్బులు, బిగ్ సి మొబైల్స్, వాటిక హెయిర్ ఆయిల్ లాంటి సంస్థల తరుపున ప్రచారం చేసారు.
తాజాగా సమంత పారగాన్ చెప్పులు కంపెనీ తరుపున ప్రచారం చేయబోతోంది. ఇప్పటికే సమంతకు, ఆ కంపెనీ మధ్య డీల్ కూడా ఒకే అయింది. ఈ విషయాన్ని సమంత తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ చెన్నైలో జరిగినట్లు తెలిపారు.
బిజీ షూటింగ్ షెడ్యూల్ మధ్యలో కాస్త గ్యాప్ దొరకడంతో సమంత ఈ మధ్యనే లండన్ వెళ్లింది. ప్యారగాన్ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో భాగంగా చెన్నై తిరిగి వచ్చింది.

సమంత రభస
సమంత తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ సరనన ‘రభస' చిత్రంలోనటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

మనం
సమంత నటించిన మరో తెలుగు చిత్రం ‘మనం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ నెలాఖు లేదా, వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇతర చిత్రాలు
దీంతో పాటు ఆమె నటించిన ఆటో నగర్ సూర్య విడుదలకు సిద్దమవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలోనూ నటిస్తోంది.

తమిళ చిత్రాలు
సమంత తమిళంలో అంజాన్, ఏఆర్ మురుగదాస్‌కు సంబందించిన మరో ప్రాజెక్టులో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











