ఆ సినిమా హిట్టైతే బాధపడతా: సమంత
రీసెంట్ గా సమంత..డేట్స్ సర్దుబాటు వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆమెకు వరస ఆఫర్స్ రావటం,వాటిని ఒప్పేసుకోవటం..ఏదో ఒక సినిమా డేట్స్ ముందుకో వెనక్కో ..ఏదో ఒక కారణంతో జరగటం ..అక్కడనుంచి ఆమె మిగతా షెడ్యులంతా ఖరాబవటం జరుగుతోంది. దాంతో ఆమెతో చేస్తున్న నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. ఎవరూ ఆమెను వదులుకోవటానకి సిద్దంగా లేరు. ఈ నేపధ్యంలో ఆమె మరిన్ని సినిమా ఆఫర్స్ కి నో చెప్పేస్తోంది. డేట్స్ సర్దుబాటు చేయలేక పెద్ద పెద్ద సినిమాలకే 'నో' చెప్పేస్తున్నారట సమంత. ఈ విషయంపై సమంత స్పందిస్తూ -''స్టార్‌డమ్ వచ్చాక ఏ హీరోయిన్‌కి అయినా ఇలాంటి పరిస్థితి తప్పనిసరి. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. వదులుకుంటున్న అవకాశాలపైనే నా టెన్షన్ అంతా. నేను వదిలేసిన సినిమా మరో హీరోయిన్ చేసి, ఆ సినిమా ఊహించని విజయం సాధిస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. కానీ తప్పడంలేదు. తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలన్నీ ప్రతిష్టాత్మకమైనవే. అందుకే తమిళంలో వస్తున్న గొప్ప గొప్ప అవకాశాలను కూడా వదిలేసుకుంటున్నాను. మరి నా నిర్ణయాలు నాకు మంచే చేస్తాయో, లేక చెడు చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి'' అన్నారు సమంత.
మరో ప్రక్క తమిళ సినీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే త్వరలో ఆమె మణిరత్నం దర్శకత్వంలో నటించబోతోంది. నిన్నటి తరం హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ కథానాయకుడిగా మణి ఓ చిత్రం రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో నాయికగా సోనమ్‌కపూర్ దాదాపు ఖరారైనట్లే అని కొద్ది రోజుల కిందటే వార్తలొచ్చాయి. అయితే సోనమ్ కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో సమంతను ఎంచుకొన్నారు. ఈ సినిమా జూన్‌లో మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. ఇక క్రితం సంవత్సరం ఆమె నటించిన 'దూకుడు' చిత్రం వంద రోజుల మైలురాయి దాటడంతో సమంత ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..''ఆ చిత్రమంతా మహేష్‌బాబు వన్‌మేన్ షో. ఆయన నటన వల్లే అంతటి విజయం దక్కింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మరోసారి ఆయన సరసన నటించడం సంతోషం'' అంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్సకత్వంలో ఓ చిత్రం,రాజమౌళి ఈగలోనూ కీ రోల్ చేస్తోంది. ఈ రెండు చిత్రాలు ఈ సంవత్సరం విడుదల అవుతాయి.


Click it and Unblock the Notifications











