డైరెక్టర్‌ను రాస్కెల్, పిగ్, బేవకూఫ్ అంటూ తిట్టిన సమంత!
హైదరాబాద్: సమంత ఎప్పుడూ స్మైలీ ఫేస్‌తో, చాలా కూల్‌గా అసలు కోపం అంటే ఏమిటో తెలియదు అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు మీకు కోపమే రాదా? ఇదే విషయం ఆమెను అడిగితే....ఆసక్తికర సమాధానం చెప్పింది. నాకు కూడా కోపం వస్తుంది. అయితే దాన్ని నేను బయటకు చూపించను. ఎంత కోపం వచ్చినా ఏర్పడకుండా స్మైల్ తో కవర్ చేస్తాను అని తెలిపింది.
ఒకసారి ఓ డైరెక్టర్ ఆమెను చాలా ఇరిటేట్ చేసాడట. దీనిపై ఆమె మాట్లాడుతూ...ఆ డైరెక్టర్ చేసిన సీన్ మళ్లీ మళ్లీ చేయించాడు. దాదాపు అరగంట పాటు విసిగించాడు. చాలా కోపం వచ్చింది. మనసులో అతన్ని రాస్కెల్, స్టుపిట్, స్కౌండ్రన్,పిగ్, బేవకూప్, పిగ్, ర్యాట్ అని తిట్టుకున్నాను సమంత చెప్పుకొచ్చింది. ఆ డైరెక్టర్ ఎవరు? అనే విషయం మాత్రం చెప్పలేదు.

సమంత సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం ఆమె తమిళంలో కత్తి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
దీంతో పాటు తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











