twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూఇయర్ పార్టీ: గోవాలో సమంత ఎంజాయ్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ సమంత న్యూఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకుంటోంది. తన పర్సనల్ స్టైలిస్ట్ నీరజ కోన, మరికొందరు స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. స్కూటర్లపై గోవా వీధుల్లో తిరుగుతూ ఆనందంగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు స్లైడ్ షోలో చూడొచ్చు.

    సినిమాల పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్న సమంత...ఇటు యాడ్ ఫిల్మ్స్ విషయంలోనూ అందరికంటే ముందు ఉంది. వీటి ద్వారా ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్ కూడా ఆమె అని అంటున్నారు. సమంత కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది. తాజాగా హీరోయిన్ సమంత కోకాకోలా కంపెనీ ఉత్పత్తి అయిన ‘మాజా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపకయింది. సౌత్ లో మాజా యాడ్ కు ఎంపికయిన తొలి హీరోయిన్ సమంతే కావడం విశేషం.

    ఆమె సినిమాల విషయానికొస్తే.... సమంత సినిమాల విషయానికొస్తే... ఇటీవల ఆమె తమిళంలో కత్తి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విజయ్ హీరోగా నటించారు. తమిళంలో సమంతకు ఇదే ఇప్పటి వరకు తొలి మరియు అతి పెద్ద హిట్. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం సమంత తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    సమంత

    సమంత

    తన పర్సనల్ స్టైలిస్ట్ నీరజ కోనతో కలిసి గోవా వీదుల్లో స్కూటరుపై చక్కర్లు కొడుతున్న సమంత.

    సముద్రం ఒడ్డున

    సముద్రం ఒడ్డున

    సముద్రం ఒడ్డున సమంత ఇలా చెప్పులు లేకుండా....

    ఆటలు

    ఆటలు

    సముద్రం ఒడ్డున ఇసుక తెన్నల్లో తన స్నేహితులతో కలిసి సమంత ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేసిందని ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది.

    ఈ వారం మొత్తం ఇక్కడే

    ఈ వారం మొత్తం ఇక్కడే

    న్యూఇయర్ సందర్భంగా ఈ వారం మొత్తం ఇక్కడే తన స్నేహితులతో కలిసి గడపనుంది సమంత.

    English summary
    Tollywood actress Samantha to celebrate NYE 2015 in Goa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X