సమంత...బెస్ట్ దిపావళి మూమెంట్స్ విత్ టాలీవుడ్

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ సమంత ఈ దీపావళిని సిటీలోనే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది ఈ సుందరి. తన ఫేవరెట్ దీపావళి మూమెంట్స్ గురించి ఆమె మాట్లాడుతూ...'నా జీవితంలోని కొన్ని బెస్ట్ దీపావళి మెమోరీస్ టాలీవుడ్‌ కి సంబంధించి కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.

గత సంవత్సరం దూకుడు సక్సెస్‌ కావడంతో దీపావళి వేడుకలను దర్శకుడు శ్రీను వైట్ల అతని ప్యామిలీతో కలిసి జరుపుకున్నాను. ఈ సంవత్సరం మరోసారి దీపావళి వేడుకలను హైదరాబాద్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'యూనిట్ సభ్యులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది.

సమంత తొలిసారిగా ప్రస్తుతం తాను నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి గాను సొంత డబ్బింగ్ చెప్పుకుంటోంది. సమంత చేతిలో ఇప్పుడు 5 తెలుగు సినిమాలు ఉన్నాయి. నాగ చైతన్యతో కలసి దేవాకట్ట దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య', నాని తో కలిసి గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు', మహేష్ బాబుతో కలిసి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థతో కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సానిమాకు కమిట్ అయింది.

రామ్ చరణ్ తేజతో కలిసి ఆమె 'ఎవడు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ....కొన్ని అనుకోని కారణాలతో ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పించారు. 'ఈ సారి డేట్స్ ప్రాబ్లం మాత్రం కాదు....ఓ వ్యక్తి తనను కావాలని సినిమా నుంచి బయటకు తప్పించాడు' అని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X