‘కత్తి’ సెట్లో సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటో)
హైదరాబాద్: హీరోయిన్ సమంత ప్రస్తుతం 'కత్తి' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న సమంత బర్త్ డే కావడంతో సినిమా సెట్లోనే యూనిట్ ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో విజయ్‌తో పాటు దర్శకుడు మురుగదాస్, ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు. యూనిట్ సభ్యులు తన పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడంపై సమంత చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అందరూ తన పట్ల ఎంతో అభిమానం చూపిస్తున్నారని, పుట్టినరోజు వేళ ఇంటికి దూరంగా లేననే బెంగలేదని సమంత ఆనందం వ్యక్తం చేసిందట.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో....సమంత కేక్ కట్ చేస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. సినిమా యూనిట్ సభ్యుల్లో ఒకరు ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. దీపావళికి విడుదల చేయడమే లక్ష్యంగా త్వరితగతిన సినిమా షూటింగ్ జరుగుతోంది.
కత్తి సినిమాలో విజయ్-సమంత తొలిసారి కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. బెంగాళీ నటుడు తోటా రాయ్ చౌదరి కూడా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











