గర్భాశయ కేన్సర్-టీకా వేయించుకున్న సమంత!(ఫోటో ఫీచర్)
చెన్నై: ఇటీవల పలువురు సెలబ్రిటీలు సర్వైకల్ కేన్సర్(గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ) బారిన పడిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మనీషా కొయిరాలాతో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వ్యాధికి గురయ్యారు. అమెరికాలో చికిత్స చేయించుకుని సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయట పడ్డారు.
సర్వైకల్ కేన్సర్ ప్రస్తుతం భారత్‌లో సర్వధారణం అయిపోయింది. అదే సమయంలో ఇది ప్రమాదకరమైది కూడా. ప్రస్తుతం ఈ వ్యాధిపై దేశ వ్యాప్తంగా చైతన్యం కల్పిస్తూ... దాన్ని నిరోధించడానికి టీకాలు వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకుంది హీరోయిన్ సమంత.
కస్తూర్భా ట్రస్ట్ గవర్నమెంట్ హాస్పటల్ లో నిర్వహించిన సర్వైకల్ కేన్సర్ నిరోధక టీకా కార్యక్రమంలో పాల్గొంది. అందరితో పాటే సమంత కూడా ఈ టీకా వేయించుకుంది. ఆ రోజంతా సమంత అక్కడ పిల్లలో గడిపింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ వాక్సినేషన్ క్యాంపులో పాల్గొనడం వల్ల...... సర్వైకల్ కేన్సర్ పై జనాల్లో అవగాహన త్వరగా చొచ్చుకెలుతుందని నిర్వాహకులు అంటున్నారు.
వాక్సినేషన్ క్యాంపులో సమంత ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి

వాక్సిన్ వేయించుకుంటున్న సమంత.

సర్వైకల్ క్యాంపులో సమంత.

క్యాంపు నిర్వాహకులతో సమంత.

పిల్లలతో సమంత ముచ్చట్లు

సర్వైకల్ క్యాంపులో సమంత.


Click it and Unblock the Notifications











