»   » సమంతా చైతూల "లూజర్ విన్నర్" ఫొటో చూసారా..?? పీవీ సింధు కూడా ....

సమంతా చైతూల "లూజర్ విన్నర్" ఫొటో చూసారా..?? పీవీ సింధు కూడా ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన సమంత, నాగచైతన్యలు ఇప్పుడు అన్ని విషయాలు పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా ప్రకటించిన ఈ జంట గతంలో తాము దిగిన ఫోటోలను ఇప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంత ట్వీట్ చేసిన ఓ ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నాగ‌చైత‌న్య అవ‌త‌లి కోర్టులో రాకెట్ పట్టుకుని నిల‌బ‌డి ఉంటే.. ఇవ‌త‌లి కోర్టులో స‌మంత పడిపోయి ఉంది. స‌మంత ప‌క్క‌న విన్న‌ర్ అని.. చైతూ ప‌క్క‌న లూజ‌ర్ అని క్యాప్ష‌న్ పెట్టడం విశేషం. స‌మంత ప‌డుకునే న‌వ్వుతూ ఫొటోకు పోజిస్తోంది. అంతటితో ఆగకుండా "బూ హ హ హ హ హ..! నాకు పీవీ సింధు స్పూర్తి" అని ట్విట్టర్ లో తెలిపింది.

Samantha, Chaitanya settle score on badminton field

ఈ ట్వీట్ కు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వెంటనే స్పందించారు. హ హ హ గెలిచినందుకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. నేను చీట్ చేశాను అని సమంత జ్వాలాకు రిప్లై ఇచ్చింది. అంటే.. ఆటలో చైతన్య గెలిచినట్లు పరోక్షంగా బయటపెట్టింది సమంత. పి.వి.సింధు త‌మ‌కు స్ఫూర్తిగా నిలిచిన టైంలో ఇలా ఆడామంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించింది స‌మంత‌. ఇంకా విచిత్రం ఏమిటంటే పీవీ సింధు కూడా స్పందించటం... "సమంతా..! ఎటూ చివరిగా గెలుపు నీదే లే" అంట్తూ చిలిపిగా ఒక ట్వీట్ పెట్టింది సింధు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Samantha, Chaitanya settle score on badminton field

ఇంత‌కుముందు చైతూ-స‌మంత క‌లిసి షాపింగ్ చేస్తున్న.. క‌లిసి సినిమా చూస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఈ మ‌ధ్యే ఇద్ద‌రూ క‌లిసి జిమ్ చేస్తున్న వీడియో కూడా ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అవ‌న్నీ ఎవ‌రో చాటుగా క్యాప్చ‌ర్ చేసి షేర్ చేసిన‌వి. ఐతే ఇప్పుడు సమంతే స్వ‌యంగా త‌మ ఇద్ద‌రి ఫొటోను షేర్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

    English summary
    Samatha on Wednesday took on Twitter to post the picture after the game, and wrote they were inspired by ace shuttler and Olympic silver medallist P V Sindhu. “Bu ha ha ha ha. That time when Pvsindhu1 got us inspired ,” she posted on Twitter along with the picture.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu