చూసారా? కాబోయే భార్య భర్తలు చైతూ, సమంత షాకింగ్ వర్కౌట్స్ (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నాగ చైతన్య, సమంత త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో లేదా 2017 ప్రారంభంలో ఈ వీరి వివాహం జరుగబోతోంది.

త్వరలో భార్య భర్తలు కాబోతున్న వీరు కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. జిమ్ కి కూడా కలిసే వెలుతున్నారు. వీరు జిమ్ లో చేస్తున్న వర్కౌట్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో హచల్ చల్ చేస్తోంది.

సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం, నటన మాత్రమే కాదు.... ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకోసం వీరు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

యాక్టింగ్ కొనసాగిస్తుందట

యాక్టింగ్ కొనసాగిస్తుందట

పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తానంటోంది సమంత. ఇటీవల సినిమాలు కాస్త తగ్గించిన మాట నిజమే. కావాలనే విరామం తీసుకున్నాను. వంటలు నేర్చుకోవడానికి, ఇతర పనులు నేర్చుకోవడానికి ఆ సమయం కేటాయించాను. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తాను. నేను కోడలుగా వెళ్లబయే కుటుంబ గౌరవానికి ఎలాంటి అప్రతిష్ఠ కలుగకుండా సినిమాలను ఎంచుకుంటాను అన్నారు.

ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది

ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది

ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకకు నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు సమంత తనకు కాబోయే కోడలు అంటూ పరిచయం చేసారటన నాగార్జున.

జంటగా వచ్చారు

జంటగా వచ్చారు

ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకకు నాగ చైతన్య, సమంత కలిసి జంటగా రావడంతో వీరి పెళ్లి విషయంలో అపీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చినట్లయింది. పెళ్లి వేడుకలో ఈ జంటను చూసిన వారంతా చూడముచ్చటైన జంట అంటూ చర్చించుకున్నారు.

అమలతో కలిసి సమంత

అమలతో కలిసి సమంత

కాబోయే అత్తగారు అమలకు సమంత చాలా క్లోజ్ అవుతోంది. ఇటీవల వారు అన్నపూర్ణ స్టూడియెలో కలిసి ఇలా చాలా విషయాల గురించి ముచ్చటించారు. తనకు కాబోయే కోడలికి చాలా సూచనలు చేసిందట అమల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X