»   » పేరు మారింది... ఇకపై సమంతను అలా పిలవొద్దు!

పేరు మారింది... ఇకపై సమంతను అలా పిలవొద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ సమంత రుత్ ప్రభును ఇకపై అలా పిలవడానికి వీల్లేదు. ఈ నెల 6న నాగ చైతన్యను వివాహమాడిన తర్వాత సమంత అక్కినేని ఇంటి కోడలు అయింది. దీంతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన పేరును 'సమంత అక్కినేని'గా మార్చుకుంది.

నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ పద్దతిలో గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ సముద్రపు ఒడ్డునగల స్టార్ హోటల్ లో కన్నుల విందుగా వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సమంత అక్కినేని

సమంత అక్కినేని

అక్కినేని ఇంటి కోడలుగా మారిన సమంతకు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైతూతో కలకాలం సంతోషంగా జీవితం సాగించాలని, ఇద్దరూ కలిసి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

షూటింగుల్లో బిజీ బిజీ

షూటింగుల్లో బిజీ బిజీ

పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య తమ తమ సినిమాల షూటింగుల్లో బిజీ అయ్యారు. హైదరాబాద్ లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ ఏర్పాటు చేయాలని నాగార్జున భావిస్తున్నారు. అయితే వారి బిజి షెడ్యూల్ కారణంగా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.

డిసెంబర్లో హనీమూన్

డిసెంబర్లో హనీమూన్

నాగచైతన్య-సమంత హనీమూన్ ట్రిప్ కూడా డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నారు. క్రిస్ మస్ సీజన్లో యూఎస్ఏకు లాంగ్ ట్రిప్ వేసి హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

జస్ట్ ఫార్మాలిటీ కోసమే వివాహం...

జస్ట్ ఫార్మాలిటీ కోసమే వివాహం...

తమ మనసులో ఇద్దరికీ వివాహం ఎప్పుడో జరిగిందని.... సంప్రదాయాలను గౌరవించాలి కాబట్టి పెద్దలు, బంధువులు, స్నేహితుల సాక్షిగా పెళ్లి చేసుకున్నట్లు సమంత ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మామయ్యతో కలిసి సమంత మూవీ విడుదలకు సిద్ధం

మామయ్యతో కలిసి సమంత మూవీ విడుదలకు సిద్ధం

తన మామయ్య నాగార్జునతో కలిసి సమంత నటించిన ‘రాజుగారి గది 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సమంత ఆత్మగా కనిపించబోతున్నారు. వీటితో పాటు సమంత ‘అదిరింది', ‘సావిత్రి', ‘రంగస్థలం 1985' చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    Actress Samantha has proudly attached the 'Akkineni' tag to her name after marrying Naga Chaitanya just a few days ago. The first platform where people can see the 'Samantha Akkineni' name is, Twitter, where she enjoys 4.8 million followers. Earlier, Sam's twitter handle used to be 'Samantha Ruth Prabhu'.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X