»   » ఆ ఫోటో చూసి సమంత ఆశ్చర్య పోయింది... వైరల్ పిక్!

ఆ ఫోటో చూసి సమంత ఆశ్చర్య పోయింది... వైరల్ పిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనకు చెందిన ఓ అరుదైన ఫోటోను మనకు తెలియకుండా వేరెవరైనా పోస్టు చేస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. తాజాగా హీరోయిన్ సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన చిన్ననాటి రేర్ ఫోటోను ఓ అభిమాని పోస్టు చేయడంతో 'ఈ ఫోటో నేను పోస్టు చేశానా?' అంటూ ఆశ్చర్యపోయింది.

ఆ ఫోటోను సమంత తన ట్విట్టర్ ద్వారా మళ్లీ అభిమానులతో పంచుకుంది. సమంత దాదాపు సంవత్సరం వయసున్నపుడు తీసిన ఫోటో ఇది. తన ఇద్దరు అన్నయ్యలతో కలిసి ఉన్న ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సమంత చిన్ననాటి ఫోటో ఇదే..

సమంత చిన్ననాటి ఫోటో ఇదే..

తన ఇద్దరు అన్నయ్యలతో కలిసి సమంత చిన్న నాటి ఫోటో ఇదే. సమంత ఈ ఫోటో ఎప్పుడు షేర్ చేసిందో తెలియదు కానీ.... మళ్లీ ఆ ఫోటోను ప్రియాంక అనే అభిమాని మళ్లీ పోస్టు చేయడంతో సామ్ ఆశ్చర్యపోయింది.

సమంత గురించి మరిన్ని విశేషాలు

సమంత గురించి మరిన్ని విశేషాలు

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

ఫ్యామిలీ..

ఫ్యామిలీ..

సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

తెరంగ్రేటం

తెరంగ్రేటం

ఏమాయ చేశావె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది. తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామ కూడా ఈవిడే.

నాగ చైతన్యతో వివాహం

నాగ చైతన్యతో వివాహం

తొలి సినిమా కోస్టార్ నాగ చైతన్యతో స్నేహం చేసిన సమంత చివరకు అతడితో ప్రేమలో పడింది. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అక్టోబర్ 6న గోవాలో వీరి వివాహం జరుగబోతోంది.

English summary
Tollywood actress Samantha Childhood Pic Goes Viral in social media. A fan named Priyanka posted this pic on twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu