తాను ఆ సినిమా చేయటం లేదని సమంత వివరణ
హైదరాబాద్ : హాట్ బ్యూటీ సమంత త్వరలో బాలీవుడ్ కి పరిచయం కాబోతోందని, సింగమ్ 2 లో అజయ్ దేవగన్ సరసన నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో మీడియావారు ఆమె వద్ద ఈ విషయం ప్రస్తావించినప్పుడు..అలాంటిదేమీ లేదని ఆమె కొట్టిపారేసారి. అవి కేవలం రూమర్స్ అని తేల్చేసారు.
సమంత త్వరలో అజయ్ దేవగణ్ సరసన 'సింగమ్ 2' చిత్రంలో చేయటం లేదని సమంత సన్నిహితులు తోసిపుచ్చారు. ప్రస్తుతం తెలుగులో సమంత ఏడు చిత్రాలు అంగీకరించింది. అలాగే తమిళంలో సూర్యతో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో హిందీ సినిమా చేయట్లేదని వారు తెలిపారు.
ఈ విషయమై సమంత మాట్లాడుతూ...తాను ప్రస్తుతం పూర్తి బిజీగా తెలుగు సినిమాలతో ఉన్నానని, మరో చిత్రం సైన్ చెయ్యటానికి అసలు ఖాళీ లేదని అన్నారు. ప్రస్తుతం తెలుగులో ఏడు చిత్రాలు చేస్తున్నానని, ఈ స్దితిలో బాలీవుడ్ ని సినిమా ఎలా ఒప్పుకుంటానని అన్నారు.
ప్రస్తుతం సమంత...పవన్ సరసన త్రివిక్రమ్ చిత్రంలో చేస్తోంది. అలాగే ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం, వివి వినాయిక్ చిత్రం, ఎన్టీఆర్ రభస చిత్రాలు తెలుగులో చేస్తోంది. అలాగే లింగు స్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం కూడా కమిటైంది. ఈ నేపధ్యంలో ఆమె అసలు తీరికలేకుండా ఒకటి తర్వాత మరొకటి పూర్తి చేసి తర్వాత కొత్త చిత్రాలు గురించి ఆలోచించాలనుకుంటోంది.


Click it and Unblock the Notifications











