హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఇబ్బంది పడ్డాను కానీ...సమంత
నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను కానీ, నా నిర్మాతలను మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఆ నింద నాపై పడకుండా ఆ దేవుడే నన్ను కాపాడాడు. ప్రస్తుతం నా సినిమాల షూటింగ్‌లన్నీ యధాతథంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి 'ఆటోనగర్ సూర్య' షూటింగ్‌లో పాల్గొంటాను అంటూ మీడియాకు తెలియచేసింది సమంత.
అనారోగ్యం కారణంగా ఆమె ఒప్పుకున్న సినిమాల షెడ్యూల్స్ అప్‌సెట్ అయ్యాయని, మళ్లీ కాంబినేషన్స్ సెట్ చేసుకోవడమంటే అది నిర్మాతలకు తలకు మించిన పనే అని, దీనివల్ల్ల వారి తలపై ఆర్థిక భారం కూడా పడక తప్పదని పలు కథనాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఈ కథనాలు చూసి హర్ట్ అయిన సమంత పైవిధంగా స్పందించారు.
అలాగే ...''జూన్, జూలై నెలల్లో నేను మణిరత్నంగారి సినిమాకు డేట్స్ ఇచ్చాను. అనుకోకుండా ఆ సినిమా నుంచి నేను వైదొలగాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో నాకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రెస్ట్ తీసుకోవడానికి అవకాశం కుదిరింది. తర్వాత సిద్దార్థ్-నందినిరెడ్డిల సినిమా పూర్తి చేసి, చివరి షెడ్యూల్ టైమ్‌కి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో పాల్గొంటాను'' అని వివరించారు.
ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్ సూర్య' ' రామ్ చరణ్ ' ఎవడు',గౌతమ్ మీనన్ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











