»   »  కోమాలోకి హీరోయిన్ సమంత

కోమాలోకి హీరోయిన్ సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కంగారుపడాల్సిందేమీ లేదు... తాను ఫుడ్ కోమాలోకి వెళ్లానని హీరోయిన్ సమంత ట్వీట్ చేసిన విషయం ఇది. రీసెంట్ గా ఆమె లీజర్ టైమ్ లో ఆమె అథిక ఆహారం తీసుకున్నానని చెప్తూ ఇలా కామెంట్ చేసింది. ఆ ట్వీట్ లో ... "8 ఐస్ క్రీమ్ లు, బిర్యాని, ఛాట్, రసమలై. ఫుడ్ ఫుడ్ ఇంకా ఫుడ్..గత రెండు రోజుల నుంచీ తీసుకుంటూనే ఉన్నాను..అలా ఫుడ్ కోమా ఏర్పడింది." అన్నారు.

సెలబ్రేటీలు ఏం చెప్పినా బాగుంటుంది. వారు ఏదైనా విషయమై ట్వీట్ చేస్తే అది సంచలనం అయి కూర్చుంటుంది. సినిమా గురించి ట్వీట్ చేస్తే ఆ సెలబ్రేటీ అభిమానులంతా ఆ సినిమా చూడటానికి ఎగబడతారు. సమంత కూడా ఆ సెలబ్రేటీల లిస్ట్ లోకి ఎక్కింది. ఆ మధ్యన 1 నేనొక్కడినే చిత్రం పోస్టర్ పై సమంత ట్వీట్ చేసి వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తను చూసిన చిత్రం చాలా బాగుందంటూ ఆమె ట్వీట్ చేసి ఆ సినిమాకు క్రేజ్ తెచ్చింది.

Samantha

ఎన్టీఆర్‌, మహేష్‌, పవన్‌ వంటి అగ్ర హీరోలతో జతకట్టి టాలీవుడ్‌ టాక్‌ ఆఫ్‌ది హీరోయిన్‌గా నిలిచిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కోలీవుడ్‌ క్వీన్‌గా మారనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది సమంత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉండగా మరో పెద్ద హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

మరో ప్రక్క సమంత కూడా కొన్నాళ్ల వరకూ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండనని ప్రకటించింది. కారణం.. తమిళ, మలయాళ రంగాల్లో దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. 'మనం'లోనూ సమంతే కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికీ సంతకం పెట్టింది. వీటితో పుల్‌స్టాప్‌ పెట్టేసింది సమంత. కొత్త కథలు వినడం లేదు. విన్నా ఒప్పుకోవడం లేదు. ''గత మూడేళ్లుగా తెలుగు సినిమాతో మమేకమైపోయా. నటిగా నాకు భాషా బేధం లేదు. తమిళ, మలయాళ చిత్రాలనుంచీ ఆహ్వానం అందుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అందుకే తెలుగు సినిమాలకు తాత్కాలికంగా దూరం అవుతున్నా'' అంటోంది సమంత.


ప్రస్తుతం సమంత పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం', సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక తెలుగులో సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో సమంత నటించనుంది.

English summary
Samantha tweeted ..“8 ice creams, biryani, chaat, rasmalai. Food food and more food has been consumed in the last 2 days... Food coma has happened”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu