Samantha: ప్రధాని మోదీపై సమంత కామెంట్స్ వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
కొన్నిసార్లు సెలబ్రిటీలు చేసే కామెంట్లు తీవ్ర దుమారం రేపుతాయి. అవి ఎక్కడి దాకా తీసుకెళ్తాయో చెప్పలేం. ఏ అంశంపైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి.. వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, యాంకర్ అనసూయ వంటి వారు చాలామందే ఉన్నారు. తాజాగా ఇలాంటి జాబితాలో చేరింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. గతంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ పాలనపై పలు వ్యాఖ్యలు చేసింది సామ్. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ కాగా నెటిజన్లు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీకి మద్దతుగా..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితి చూస్తుంటే.. ఎప్పుడో ఏదో మాట్లాడిన దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాలనిపిస్తుంది. బీజేపీ, ప్రధాని మోదీపై గతంలో సామ్ చేసిన ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇటీవల కూడా ఓ ఇంటర్వ్యూలో భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే తన మద్దతు అని చెప్పినట్లు సమాచారం.

ఓల్డ్ వీడియో షేర్..
అయితే గతంలో సామ్ చేసిన ఈ ఓల్డ్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను క్రికెటర్ అమిత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇక వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు.

మార్పు వస్తుందని..
ఈ వీడియోలో సమంత.. ''నేను ఎప్పుడూ మోదీజీకే సపోర్ట్ చేస్తాను. ఆయన చేసిన మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నా'' అని తెలిపింది. ఇక మరో వీడియోలో ''నేను మోదీ సపోర్టర్‌నే. ఎందుకంటే ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారు. ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారు'' అని మాట్లాడింది సామ్.

ఇదేనా మార్పు?
దీంతో సామ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ ప్రస్తుత నిర్ణయాల నేపథ్యంలో సమంత ఓల్డ్ కామెంట్స్‌ను నెటిజన్లు వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ''ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1100 అయింది. ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా?'' అని చురకలు అంటిస్తున్నారు.
నెటిజన్ల అసహనం..
అలాగే మోదీ తీసుకున్న పథకాలు, నిర్ణయాలపై ఉన్న అసహనాన్ని సమంతపై వెల్లగక్కుతున్నారు. కామెంట్స్ రూపంలో ట్రోలింగ్‌కు దిగారు మరికొంత మంది నెటిజన్లు. కాగా సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











