»   » స్టార్ హీరోలను పొగిడేస్తూ చాలా తెలివిగా పడగొడుతోంది...

స్టార్ హీరోలను పొగిడేస్తూ చాలా తెలివిగా పడగొడుతోంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేసావె సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సమంత, తీసిన రెండు చిత్రాలు విజయం సాధించడంతో, మరో పెద్ద హీరోతో సీనిమా ఛాన్స్ కొట్టేసింది. అదేనండి మహేష్ బాబుతో 'దూకుడు" చిత్రంలో ఈ అమ్మడికి హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. దాంతో ఊరుకోకుండా ఇప్పుడు రామ్ చరణ్ పై కన్నేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఈ మద్యే ఆరంజ్ మూవి స్టిల్స్ చూసానని ఆరంజ్ మూవీలో చరణ్ చాలా హ్యాండసమ్ గా ఉన్నాడని చెప్తూ, రామ్ చరణ్ నా ఫేవరెట్ హీరో అని తను డ్యాన్సు బాగా చేస్తాడని, చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. సమంత చాలా తెలివిగా హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతూ సినిమా అవకాశాలను కొట్టేస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu