అది కేవలం గాలి కబురే అంటూ ఖండించిన సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో యువతల మనస్సులోకి దూసుకు పోయిన సమంత తాజాగా బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకుందనే వార్తలు వచ్చాయి.గోలీమార్ దర్శకుడు రోహిత్ శెట్టి నెక్స్ట్ సినిమా బోల్ బచ్చన్ చిత్రంలో ఆమెను తీసుకున్నారని అంతటా వినిపించాయి. అంతేగాక అందులో అభిషేక్ బచ్చన్ సరనస చెయ్యబోతోందని, పూర్తి ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్ర అని కొన్ని పత్రికలు రాసాయి. దాంతో ఆమె అభిమానలు కంగారుపడి ఆమెకు ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో మెసేజ్ లు పెట్టేసారు.
దాంతో వెంటనే సమంత రియాక్టై తానను ఏ దర్శకుడూ సంప్రదించలేదని,అయినా తను తెలుగులో పూర్తి కంపర్ట్ గా ఉన్నానని, ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాని ఆ వార్త నిరాధారమైన గాలి వార్త అని ఖండించింది. అంతేగాక తను గనుక బాలీవుడ్ ఆఫర్ ఒప్పుకుంటే మీడియా ద్వారా తానే స్వయంగా తెలియచేస్దానని అంది. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో ప్రస్తుతం తెలుగు హీరోయిన్ కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.సింగం టైటిల్ తో రూపొందుతున్న ఆ చిత్రం తెలుగులో వచ్చిన యముడుకి రీమేక్.


Click it and Unblock the Notifications











