అవన్నీ రూమర్సే...నమ్మద్దు: సమంత
హైదరాబాద్ : తనపై వస్తున్న వార్తలను ...రూమర్స్ అని కొట్టిపారేసింది సమంత. ముఖ్యంగా పారితోషికం విషయంలో కొందరు పనిగట్టుకుని రూమర్స్ సృష్టిస్తున్నారని చెన్నై చిన్నది సమంత వాపోయింది.
తెలుగు, తమిళంలో వరుస విజయాలతో దూకుడుమీదున్న భామ సమంత. ఆమె ప్రతి సినిమా చక్కటి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.
సమంత మాట్లాడుతూ... తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత ఇస్తేనే నటిస్తానని ఏ నిర్మాతనూ ఇబ్బంది పెట్టలేదు. నా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినంత తీసుకుంటున్నాను అంది.
అలాగే నేను ఇంకా కోటి రూపాయలకు కూడా చేరుకోలేదు. అలాంటప్పుడు రూ.1.75 కోట్లు అందుకుంటున్నానని ఎలా రూమర్స్ వ్యాపింపజేస్తారో తెలియట్లేదని మండిపడింది.
సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత వినాయిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ మొదలువుతుంది.


Click it and Unblock the Notifications












