»   » సమంత పర్శనల్: నోరు జారి సీక్రెట్ రివీల్, ఏడ్చేసింది, . ‘కత్తి’రీమేక్ కి నో

సమంత పర్శనల్: నోరు జారి సీక్రెట్ రివీల్, ఏడ్చేసింది, . ‘కత్తి’రీమేక్ కి నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సింగిల్‌గా ఉండడం హ్యాపీగానే ఉందా అన్న ప్రశ్నకు 'సింగిల్‌గా ఎవరున్నారు..?' అని తిరిగి ప్రశ్న వేసి, కట్‌.. నెక్ట్స్‌ క్వశ్చన్ అంటూ జారుకుంది సమంత(నవ్వుతూ)...ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది.

సిద్దార్దతో బ్రేకప్ తర్వాత... ఈ మధ్యకాలంలో ఆమె తెలుగులోని ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని రూమర్స్ వస్తున్నాయి.ఇలాంటి సమంయలో ఆవిషయం కన్ఫర్మ్ చేయటానికా అన్నట్లు తాను సింగిల్ కాదు అని తేల్చి చెప్పింది. ఆమె తాజా చిత్రం 24 ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం రివీల్ చేసింది. అక్కడ ఓ మీడియా పర్శన్ మీరు సింగిల్ గా ఉండటాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగారు.


దానికి ఆమె వెంటనే...ఎవరు చెప్పారు నేను సింగిల్ అని ..వెంటనే తనేం సమాధానం చెప్పిందో అర్దం మయ్యి నాలుక కరుచుకుని ...కట్...నో క్వచ్చిన్ అనేసింది. అయితే ఉపయోగం లేకపోయింది. ఆమె సింగిల్ కాదనే విషయం ఆమెకు తెలియకుండానే ఆమె మాటల్లో బయిటపడిపోయింది. అయితే ఆమె తర్వాత ప్రశ్నకు అవకాశమివ్వలేదు.


కొద్ది రోజుల క్రితం ఆమె నేను ఫెరఫెర్ట్ అమ్మాయి ని కాదు, ఫెరఫెక్ట్ ఫ్రెండ్ ని కాదు, ఫెరఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ ని కాదు అంటూ ట్వీట్ చేసింది. వాళ్లవెరకీ న్యాయం చేయలేకపోతున్నా..కొద్ది రోజులు కొత్త సినిమాలు సైన్ చేయకుండా గ్యాప్ తీసుకుందామనుకుంటున్నా అంది. ఆ ట్వీట్ లో ఆమె తాను ఫెరఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ ని కాదు అంటూ తాను ఎవరికో గర్ల్ ఫ్రెండ్ ని అనే విషయం చెప్పేసింది.


అయితే ఇంటర్వూలో క్వచ్చిన్ అంటే ఊహించని విధంగా ఆన్సర్ చేసింది. కానీ ట్వీట్ మాత్రం ఆమె ఆలోచించి, ఖచ్చితంగా తన డేటింగ్ విషయం (ఉంటే కనుక) టాపిక్ అవుతుందనే విషయం తెలిసే ఇంటెన్షన్ గా ట్వీట్ చేసినట్లు. కాబట్టి సమంతను ట్రై చేయాలనుకుంటే మాత్రం ఆమె ఆల్రెడీ ఎంగేజెడ్ అనే విషయం మర్చిపోకండి.


ఆమె మాట్లాడుతూ... నిజంగా ఈ ఎనిమిది నెలలకాలం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నా. స్నేహితులు, కుటుంబ సభ్యులు... అందరినీ మరిచిపోయి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు కష్టపడిన రోజులున్నాయి. ఉదయ్‌పూర్‌లో 'బ్రహ్మోత్సవం' చిత్రీకరణ పూర్తి చేసుకొని పుణెలో హోటల్‌కి చేరుకొన్న రోజు రాత్రి అరగంట ఏడుస్తూనే ఉన్నా. ఏం జరగలేదు కానీ... ఏడుపొచ్చేసింది. స్నేహితులు, కుటుంబం, పని ఒత్తిడి... అన్నీ ఆ ఏడుపులో ఉన్నాయేమో అనిపించింది'' అని చెప్పింది.


సమంత లేటెస్ట్ ఫొటోలతో ఆమె మిగతా ఇంటర్వూ చూడండి...


ఉండాలంతే

ఉండాలంతే

దక్షిణాదిలో హీరోయిన్ ప్రాధాన్యంతో కూడిన ఓ చిత్రం విడుదలైందంటే అందులో కచ్చితంగా సమంత ఉండాలంతే. అదే లక్ష్యంతోనే నేను కథల్ని ఎంపిక చేసుకొంటున్నా అంటోంది సమంత


భాధ్యత పెరిగింది

భాధ్యత పెరిగింది

ఇదివరకు సమంత అంటే స్టార్‌ అని మాత్రమే అనేవారు. ఇప్పుడు సీనియర్‌ అని కూడా అంటున్నారు. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది.


లుక్ మార్చేసా

లుక్ మార్చేసా

ప్రస్తుతం చేస్తున్న ‘జనతా గ్యారేజ్‌' కోసం నా లుక్‌ని మార్చేశా. జుత్తుని కాస్త కట్‌ చేసుకొని కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నా. ఇలా కొత్తదనం కోసం ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి చేయాలనుకొంటున్నా''.


మంచి ఫ్రెండ్స్ అయ్యాం

మంచి ఫ్రెండ్స్ అయ్యాం

బ్రహ్మోత్సవం చిత్రంతో నేను, మహేష్‌బాబు కూతురు సితార మంచి స్నేహితులమయ్యాం (నవ్వుతూ). సూపర్ స్టార్ సితారే

సూపర్ స్టార్ సితారే

మహేష్‌ ఏమంటారో తెలియదు కానీ... సితార మాత్రం పెద్దయ్యాక సూపర్‌స్టార్‌ అవుతుంది. తన డ్యాన్స్‌, నవ్వు, నటన... బాగా నచ్చుతాయి నాకు.


ఓ వెలుగు వెలుగుతారు

ఓ వెలుగు వెలుగుతారు

మహేష్‌బాబు కుటుంబం నుంచి గౌతమ్‌, సితారలు ఓ వెలుగు వెలుగుతారు.ఆ కోరక తీరింది

ఆ కోరక తీరింది

ఇప్పటిదాకా భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న కథలు చాలానే చేశా. రొమాన్స్‌కి ప్రాధాన్యమున్న పాత్రలూ చేశా. కానీ కామెడీ మాత్రం ఎప్పుడూ చేయలేదు. అందరినీ నవ్వించాలనే కోరిక మనసులో ఎప్పట్నుంచో ఉండేది. అది ‘అఆ'తో తీరింది.


ధ్లిల్లర్ లో చేస్తున్నా

ధ్లిల్లర్ లో చేస్తున్నా

తదుపరి నా మనసు థ్రిల్లర్‌ కథలపైకి మళ్లింది. అందుకే కన్నడ చిత్రం ‘యూ టర్న్‌' రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకొన్నా. తెలుగు, తమిళ భాషల్లో ఆ చిత్రం రాబోతోంది.


పోలీసోడు హిట్టే...

పోలీసోడు హిట్టే...

విజయ్‌తో కలిసి నటించిన ‘పోలీసు' గురించి మొదట్నుంచీ నమ్మకంగా ఉండేదాన్ని. అదొక మాస్‌ సినిమా. అందరికీ నచ్చుతుందనుకొన్నా. అదే జరిగింది.నిర్ణయించుకున్నా

నిర్ణయించుకున్నా

‘24' ఒక భిన్నమైన చిత్రం. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌కి వచ్చిన ఈ ఆలోచనే ఓ అద్భుతం. కాలం నేపథ్యంతో కూడిన కథని విన్నప్పుడు ఇది ప్రేక్షకులకు అర్థమవుతుందా? అనే సందేహం కలిగింది. నటిస్తున్నప్పుడు కూడా ఎలా స్వీకరిస్తారో అని భయంగా ఉండేది. ‘ఈగ' సమయంలోనూ ఇలాగే అనిపించింది నాకు. ‘24' కథ విన్నప్పుడు నాది ఓ చిన్న పాత్రే అనిపించినా... ఇలాంటి సినిమాలో మాత్రం నేనుండాలని నిర్ణయించుకొన్నా.


తెలుగులో చేయను

తెలుగులో చేయను

మున్ముందు కంగారుగా సినిమాలు అంగీకరించను. ఇకపై హీరోయిన్‌కి స్కోప్ ఉన్న ప్రతి సినిమాలోనూ సమంత ఉంటుంది. ‘కత్తి' సినిమా ఆల్‌రెడీ తమిళంలో చేసేశాను. తెలుగులో అవకాశం వస్తే వదులుకుంటాను.


English summary
While the rumors are whirlwind that Samantha is dating a younger Telugu hero, the actress had confessed she is not single anymore. Sam attended a press meet to promote her recent release 24.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu