'ఆగడు' టీజర్...సమంత కాంట్రవర్శీ
హైదరాబాద్ : సమంత గతంలో మహేష్ చిత్రం 1 నేనొక్కిడనే చిత్రం టీజర్ విడుదల అయినప్పుడు ట్విట్టర్ లో కామెంట్స్ చేసి అంతటా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ చిత్రం 'ఆగడు' టీజర్ విడుదలైంది. దాంతో ఆమె పేరుతో ఓ ఫేక్ ట్వీట్ ప్రచారంలోకి వచ్చింది. దాంతో సమంతపై మళ్లీ వివాదం మొదలైంది. అది గమనించిన సమంత వెంటనే దాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసింది.
సమంత పేరు తో వచ్చిన ట్వీట్ లో... ' త్వరలో రిలీజ్ అయ్యే సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఆ టీజర్ పూర్తిగా కాపీ ." అంటూ వచ్చింది. దీంతో అంతా అది ఆగడు ని ఉద్దేశించే అని వెంటనే రీ ట్వీట్ లతో విమర్శలు మొదలయ్యాయి. దాంతో వెంటనే... సమంత
" ఉమ్...నా పేరుతో ఓ ఫేక్ ట్వీట్ అంతటా తిరుగుతోంది..ఎవరైతే దాన్ని తయారు చేసారో..వాళ్లు ఎదగండి.. ." అంటూ ఖండనతో కూడిన రిప్లై ఇచ్చింది.

ఇక సమంత మరోసారి మాయ చేసింది. 'మనం'లో ఇటు అందంతోనూ, అటు అభినయంతోనూ అదరగొట్టేసింది. అందరికళ్లనూ తనవైపు తిప్పుకొంది. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఆ చిత్రంలో సమంత పోషించిన పాత్రకి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి పాత్ర అప్పజెప్పినా తాను న్యాయం చేయగలుగుతానని మరోసారి నిరూపించింది సమంత. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత తెలుగుతో పాటు ఇప్పుడు తమిళంలోనూ బిజీ అయిపోయింది.
అక్కడ కాసింత గ్లామర్‌పాళ్లు ఎక్కువుండే పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ''నటనను నమ్ముకొనే వచ్చాను. అందాల ప్రదర్శన బ్రహ్మ విద్య కాదు. అది ఎవరైనా చేస్తారు. పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోవడంలోనే అసలు ప్రతిభ దాగుంది'' అని సమాధానమిచ్చింది సమంత.


Click it and Unblock the Notifications











