సమంత చూపు..చిన్న చిత్రాలవైపు
భారీ చిత్రాలే కాకుండా... కథ నచ్చితే చిన్న సినిమాలు కూడా చేయాలని సమంత భావిస్తోందని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో చిన్న చిత్రాలు చక్కటి ఫలితాల్ని సాధిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో చేస్తే నటిగా ప్రత్యేక గుర్తింపు పొందవచ్చనేది ఆమె ఆలోచన.
దానికి తోడు స్టార్ హీరోల చిత్రాల మాదిరి ఎక్కువ రోజులపాటు కాల్షీట్లు కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం ఆమె వరుసగా పెద్ద చిత్రాలు చేయడం వల్ల విశ్రాంతి సమయం కూడా తగ్గుతోందనే భావనలో ఉంది.
ప్రస్తుతం సమంత నాగచైతన్య తో మనం షూటింగ్ ఫినిష్ చేసుకుని లేట్ నైట్ ప్లైట్ కు స్విజ్జర్ లాండ్ వెళ్ళింది. అక్కడ పవన్ కళ్యాణ్ తో షూటింగ్ లో పాల్గొంటుంది. అక్కడో పాట ని తీయబోతున్నారు. దానికి ప్రిపేరవుతోంది. తర్వాత కంటిన్యూగా స్పెయిన్‌లో షూటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చాక ..ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా కి రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications












