సంపాదన అదుర్స్ : మిలియనీర్ల జాబితాలో సమంత!

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ సమంత...వరుసగా టాప్ హీరోల సరసన అవకాశాలు. వీటితో పాటు పలు కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇలా కేవలం డబ్బు సంపాదన విషయంలో మాత్రమే కాదు అభిమానులను సంపాదించుకోవడంలో కూడా సమంత ఓ అడుగు ముందే ఉంది.

తాజాగా ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ మార్కు దాటింది. తనకు ఇంత మంది అభిమానులు ఉండటంపై చాలా సంతోషంగా ఉంది సమంత. సమంత కేవలం సినిమాలు, డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా తనకు చేతనైన మేర సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటోంది. ఇప్పటి వరకు ట్విట్టర్లో మిలియన్ మార్కును అందుకున్న స్టార్లలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వారున్నారు.

Samantha crosses 1 million mark on Twitter!

సమంత సినిమాల విషయానికొస్తే...రామ్ చరణ్ తేజ్ త్వరలో శ్రీను వైట్ల చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది.

సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, జనవరి సెకండ్ వీక్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X