హాట్ సమంత కొత్త డీల్ ఎవరితో తెలుసా...?
హైదరాబాద్ : హాట్ సౌతిండియా హీరోయిన్ గా అనతి కాలంలోనే టాప్ రేంజికి ఎదిగిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా బిజీ కావడంతో ఆమెతో ప్రచారం చేయించుకోవడానికి పలు వ్యాపార సంస్థలు, బ్రాండెడ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సమంత మరో ఎండార్స్ మెంట్ డీల్ కుదుర్చుకుంది. డాబర్ వాటికా హెయిర్ ప్రొడక్స్‌కు ఆమె ప్రాచారం చేయనుంది. ఈ మేరకు సదరు కంపెనీ ఆమెకు భారీ మొత్తంలో ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. తాను డాబర్ టీంలో భాగం అయ్యాను. వాటికాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత తన ట్విట్టర్లో పేర్కింది. సమంత ఇప్పటికే బిగ్ సి, సౌతిండియా షాపింగ్ మాల్ వంటి కంపెనీలకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
సమంత సినిమాల విషయానికొస్తే..
సమంత తొలిసారిగా ప్రస్తుతం తాను నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి గాను సొంత డబ్బింగ్ చెప్పుకుంటోంది. సమంత చేతిలో ఇప్పుడు 5 తెలుగు సినిమాలు ఉన్నాయి. నాగ చైతన్యతో కలసి దేవాకట్ట దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య', నాని తో కలిసి గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు', మహేష్ బాబుతో కలిసి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థతో కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సానిమాకు కమిట్ అయింది.
రామ్ చరణ్ తేజతో కలిసి ఆమె 'ఎవడు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ....కొన్ని అనుకోని కారణాలతో ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పించారు. 'ఈ సారి డేట్స్ ప్రాబ్లం మాత్రం కాదు....ఓ వ్యక్తి తనను కావాలని సినిమా నుంచి బయటకు తప్పించాడు' అని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











