»   » వీడియో లీక్... నాగ చైతన్య, సమంత పబ్‌‌లో చిందులేస్తూ..

వీడియో లీక్... నాగ చైతన్య, సమంత పబ్‌‌లో చిందులేస్తూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమమ్ మూవీతో నాగ చైతన్య భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో హీరోయిన్ సమంతను పెళ్లాడబోతున్న నాగ చైతన్య ఈ విజయంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సంతోషాన్ని తన క్లోజ్ సర్కిల్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

తాజాగా వీరి పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. నైట్ పార్టీలో అంతా కలిసి ఎంజాయ్ చేసారు. సమంత, నాగ చైతన్య డాన్స్ చేస్తూ గడిపారు. సమంత ఆనందానికైతే అవధులే లేవు. పార్టీలో ఆమె బిహేవియర్ చాలా యాక్టివ్ గా, పట్టలేని సంతోషంతో ఉన్నట్లు కనిపించింది.

పార్టీ చేసుకున్న చైతు, సమంత

పెళ్లికి ముందు ప్రేమమ్ మూవీ పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో చైతు, సమంత చాలా హ్యాపీగా ఉన్నారు. విజయాన్ని స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

rnrnrn

విజయంపై సమంత స్పందన

ప్రేమమ్ మూవీ విడుదలై రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిన తర్వాత హీరోయిన్ సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయింది, సినిమా ఉదయం ఆటకే సూపర్ హిట్ టాక్ రావడంతో ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కేకలేస్తామో, ఏడుస్తామో, నవ్వుతామో, గెంతులేస్తామో తెలియదు. నేను మాత్రం అవన్నీ చేసేస్తున్నా' అని ట్వీటింది సమంత. కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నాగ చైతన్య, సమంత వచ్చే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

అభిమానం

అభిమానం

అన్న వదినమ్మలపై అభిమానంతో ‘ప్రేమమ్' రిలీజ్ సందర్భంగా కొందరు చైతు అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేనర్లు. సోషల్ మీడియాలో కూడా వీటిని పోస్టు చేయడం గమనార్హం.

నాగ చైతన్య-సమంత

నాగ చైతన్య-సమంత

ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Naga Chaitanya Samantha Dance in Private Party Video Leaked.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu