»   » సెక్సీ సమంత ఇలా చేయడం ఆశ్చర్యమే! (జిమ్ వీడియో)

సెక్సీ సమంత ఇలా చేయడం ఆశ్చర్యమే! (జిమ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన అందాన్ని కాపాడుకోవడానికి అమ్మడు క్రమం తప్పకుండా జిమ్ చేస్తోంది. నిపుణులైన ట్రైనర్ సమక్షంలో సమంత తన ఫిట్ నెస్ కాపాడుకుంటోంది. తాజాగా సమంత ఒక వీడియోను షేర్ చేసింది. 100 కేజీల బరువును అవలీలగా ఎత్తేసింది.

సాధారణంగా మగాళ్లకే 100 కేజీల బరువు ఎత్తడం అంటే చాలా కష్టం. అలాంటిది ఎంతో అందంగా, నాజుకుగా ఉండే సమంత ఇంత బరువు ఎత్తడం చూసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. గమనిక: వీడియో లోడ్ కావడానికి 4 సెకన్ల సమయం తీసుకుంటుంది. 

Posted by Samantha Ruth Prabhu onMonday, February 8, 2016

మరో వైపు సమంత దాదాపు నెలరోజులకు పైగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. డిసెంబర్ 27న ఆమె చివరి సారిగా ట్వీట్ చేసింది. సమంత ఇలా ఉన్నట్టుండి ఎందుకు ట్విట్టర్ కు దూరం అయిందో తెలియక, ఆమె నుండి ఒక్క ట్వీటు కూడా లేక చాలా డిసప్పాయింటుగా ఉన్నారు అభిమానులు. ఎట్టకేలకు ఆమె నుండి స్పందన రావడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ...ఆ' సినిమాతో పాటు, సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘24', మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం', విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘తేరి'లో నటిస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్', తమిళంలో ‘వడ చెన్నై' అనే సినిమాకు కమిటైంది. ఈ సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే ఆమె ట్విట్టర్ కు దూరంగా ఉంటోందనే వాదన కూడా ఉంది.

    English summary
    South Indian beauty Samantha weight lifting video in Gym has been leaked on the internet. She lifted the weight of 100 Kgs in Gym and the video has gone viral on the web.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu