మహానటి డిలీటెడ్ సీన్: సమంత ఫ్యామిలీ.. నవ్వులే నవ్వులు!
లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి చిత్రం బాక్స్ ఆఫీసర్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగుతోంది. సావిత్రిని మురిపించేలా కీర్తి సురేష్ నటన, నాగ అశ్విన్ అద్భుత దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తోంది. జెమినీగణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం నుంచి తొలగించిన సన్నివేశాలని మహానటి యూనిట్ వరుసగా విడుదల చేస్తోంది.
తాజగా సమంత డిలీటెడ్ సీన్ ని విడుదుల చేశారు. చాలా హాస్య భరితంగా ఉన్న ఈ సన్నివేశం నవ్వులు పూయించే విధంగా ఉంది. మహానటి చిత్రంలో సమంత కుటుంబాన్ని ఈ సన్నివేశంలో చూడొచ్చు.

తన తండ్రి బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సమంత పూజ చేస్తూ ఉంటుంది. శనివారం లక్ష్మీదేవికి పూజ ఎందుకు అని తండ్రి ప్రశ్నించేసరికి సమంత పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని దండం పెట్టె సన్నివేశం చాలా బావుంది. ఇక పెళ్లి ప్రస్తావన తెస్తూ తాను చూసిన కుర్రాడిని చేసుకుంటే జీవితం మొత్తం తలెత్తుకుని బ్రతకవచ్చు అని అంటాడు. హడావిడిగా దోసెలు వేసే సమంత తల్లి కల్పించుకుని.. మెడ పట్టేయదా అండీ అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.


Click it and Unblock the Notifications











