»   »  గ్లామర్ షో ఉంటే ఎక్కువ డబ్బు తీసుకుంటా: సమంత

గ్లామర్ షో ఉంటే ఎక్కువ డబ్బు తీసుకుంటా: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత తమిళనాడుకు చెందిన భామ అయినప్పటికీ....తెలుగులోనే తొలుత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యే అంజాన్, కత్తి చిత్రాల ద్వారా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలకు పెద్దగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని సమంత...ఇపుడు మాత్రం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందట.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇదే విషయమై సమంతను వివరణ అడిగితే తనదైన రీతిలో సమాధానం ఇస్తోంది. ‘ఒకప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా హీరోల పెర్ఫార్మెన్స్ చూడటానికే వచ్చే వారు. కానీ ఇప్పటి రోజుల్లో హీరోయిన్ల ప్రాధాన్యత కూడా పెరిగింది. ముఖ్యంగా యువతరం హీరోయిన్ల గ్లామర్ షో చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. హీరోలతో సమానంగా మాకూ ప్రాధాన్యత పెరిగింది. అలాంటపుడు మేము ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో తప్పేముంది' అని ప్రశ్నిస్తోంది.

Samantha demanding Rs 2 Crores

‘పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఉంటే మేము ఇంతగా డిమాండ్ చేయం. తక్కువ తీసుకోవడానికే ట్రై చేస్తాం. లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేసినా అంతే. అలాంటి పాత్రలు చేసినపుడు మంచి పాత్రలు చేసామనే సంతృప్తి ఉంటుంది. ఫుల్ కమర్షియల్ పాత్రలు చేసినపుడు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాం' అని తెగేసి చెప్పింది సమంత.

సమంత సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది.

English summary
Samantha while acting in the films Anjaan and Kaththi did not demand more salary. Now there is news that she is demanding a salary of Rs 2 Crores.When asked her about this, she said, “ In those days people use to come to the theatres to see the actors. Now they are also coming to see the actresses.’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu