హీరోయిన్లు సైతం: సమంత 10 లక్షలు, కాజల్ 5 లక్షలు
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ హీరోయిన్లు సమంత, కాజల్, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తన వంతు సాయం అందించారు. హీరోయిన్ 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. సమంత పర్సనల్‌గా 5 లక్షలు, ప్రత్యూష సపోర్ట్ ఫౌండేష్ తరుపున 5 లక్షలు, మొత్తం 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. హీరోయిన్ కాజల్ 5 లక్షలు, రాశి ఖన్నా రూ. 1 లక్ష, రకుల్ ప్రీత్ సింగ్ రూ. 1 లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం అందించారు.

సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తమిళంలో కత్తి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
దీంతో పాటు తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











