»   » దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ విక్టిమ్, మాటనిలుపుకున్న సమంత

దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ విక్టిమ్, మాటనిలుపుకున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దిల్‌సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్(బాధితురాలు)కి సమంత అభిమానులు గతంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. అభిమానులంతా కలిసి స్వచ్ఛందంగా ఈ ఫండ్ కలెక్ట్ చేసి సమంత చేతుల మీదుగా బాంబు పేలుళ్ల సందర్భంగా తన కాళ్లు కోల్పోయిన ఎంబీఏ విద్యార్థిని రజితకు ఈ మొత్తాన్ని అందజేసారు.

అప్పుడు సమంత మాట్లాడుతూ....రజితకు కృత్రిమ కాలు అమర్చేందుకు కావాల్సి మిగిలిన మొత్తాన్ని తాను సాయంగా అందిస్తానని మాట ఇచ్చింది. ఇచ్చినట్లుగానే సమంత మాట నిలబెట్టుకుంది. రూ. 2,30,000 రజిత చికిత్స కోసం సహాయం అందించింది.

Samantha-Dilsukhnagar blast victim

కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, సమంత అనేక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుని తన సేవా భావాన్ని చాటుకుంటోంది. ప్రత్యూష పౌండేషన్ కోసం నిధుల సేకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి, తద్వారా వచ్చే డబ్బును 'ప్రత్యూష ఫౌండేషన్' కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. పలువురు పాపులర్ స్టార్లకు సంబంధించిన వస్తువులను ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.

English summary
Star actress Samantha donated an amount of Rs. 2,30,000 and secured a prosthetic limb (artificial limb) for Dilsukhnagar blast victim Rajitha. Sometime back, her fans raised 50,000 Rupees to help out Rajitha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu