»   » హెయిర్ ఆయిల్ కి ఫిక్సైన సమంత

హెయిర్ ఆయిల్ కి ఫిక్సైన సమంత

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సౌతిండియాలో వరసగా పెద్ద పెద్ద ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవుతున్న సూపర్ స్టార్ మహేష్ భాబు. ఇప్పుడు మహేష్ దారిలోనే సమంత కూడా ప్రయాణిస్తూ పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కమిటవుతోంది. తాజాగా ఆమె వాటికా హెయిర్ ఆయిల్ వారికి ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా చేయటడానికి సైన్ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేస్తూ... "డాబర్ వాటికాని ఎండార్స్ చేయబోతున్నాను...డాబర్ టీమ్ లో సభ్యురాలిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది ...", అంది. ఇక ఇప్పటికే సమంత ఓ మొబైల్ స్టోర్,రిటైల్ మాల్ కి అంబాసిడర్ గా చేస్తోంది. మరిన్ని ఉత్పత్తులను త్వరలో ఆమె ఎండార్స్ చేసుకోనుంది. ఇక డాబర్ వాటికాకు నేషనల్ మార్కెట్ లో ప్రియాంక చోప్రా అంబాసిడర్ గా చేస్తోంది.

  ఇక ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య', గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

  అలాగే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్,జూ ఎన్టీఆర్ సరసన ఎంపికైంది. ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.


  ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు. సమంత కూడా ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకుంది.

  English summary
  
 
 Actress Samantha has been roped in to endorse a new range of hair care product. Samantha has become the brand ambassador of natural health care product and shall start pushing the brand amongst the masses across AP. The actress revealed this on her personal twitter account. "Will be endorsing dabur vatika... Happy to be a part of the dabur team...", she tweeted. This is Samantha's third commercial after being the face of a mobile store and a retail mall. Priyanka Chopra is endorsing the same product on the National front.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more